22 నుంచి హాయ్ లైఫ్ ఆభరణాల ప్రదర్శన
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:46 AM
హాయ్‌లైఫ్ ఆభరణాల ప్రదర్శనను ఈనెల 22, 23, 24 తేదీల్లో విజయవాడలోని నోవాటెల్ విజయవాడ వరుణ్ హోటల్‌లో నిర్వహించనున్నట్టు హాయ్ లైఫ్ జ్యూవెల్స్ సంస్థ ప్రతినిధి అశోక్ గచండే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
విజయవాడ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): హాయ్‌లైఫ్ ఆభరణాల ప్రదర్శనను ఈనెల 22, 23, 24 తేదీల్లో విజయవాడలోని నోవాటెల్ విజయవాడ వరుణ్ హోటల్‌లో నిర్వహించనున్నట్టు హాయ్ లైఫ్ జ్యూవెల్స్ సంస్థ ప్రతినిధి అశోక్ గచండే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా టాప్ జ్యూవెలర్స్ రూపొందించిన ఆభరణాలను ప్రదర్శన, అమ్మకానికి ఉంచనున్నట్టు పేర్కొన్నారు. వివాహాది శుభకార్యాలకు, రోజువారీగా ధరించేందుకూ ఆభరణాలను ఆకర్షణీయంగా రూపొందించినట్టు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.