Home » Vijayawada News
పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేంత వరకు తమ పోరాటం చేస్తామని వామపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
హాయ్లైఫ్ ఆభరణాల ప్రదర్శనను ఈనెల 22, 23, 24 తేదీల్లో విజయవాడలోని నోవాటెల్ విజయవాడ వరుణ్ హోటల్లో నిర్వహించనున్నట్టు హాయ్ లైఫ్ జ్యూవెల్స్ సంస్థ ప్రతినిధి అశోక్ గచండే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రతి పక్ష హోదా సైతం దక్కని వైసీపీకి వరుస షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా విజయవాడలోని పలువురు వైసీపీ కార్పొరేటర్లు.. జనసేన పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యాని కంటే నెల ముందుగా అంటే రెండు నెలల్లోనే పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు తన చేతుల మీదగా జరగడం చాలా సంతోషంగా ఉందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. తన కుటుంబంతోపాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు.
విజయవాడ నగరానికి భారీగా వరద నీరు పోటెత్తడం వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అందులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఉన్నాయి. వారిని ఆదుకొనేందుకు మరోసారి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ముందుకు వచ్చారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ క్రమంలో టీడీపీ శ్రేణులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారీ బుద్దా వెంకన్న.
వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, సినీనటులు, రాజకీయ నాయకులు గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలసి విరాళాల చెక్కులు అందజేశారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న బోట్లను తొలగించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రోజురోజుకూ ఈ వ్యవహారం క్లిష్టతరంగా మారుతోంది.
వరద కారణంగా బుడమేరు వరద మళ్లింపు కాలువ (బీడీసీ) ఎడమ కట్టకు పడిన గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపధికన కొనసాగుతున్నాయి.
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రికార్డు సమయంలో సహాయ చర్యలు చేపడుతున్నాయి. వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటున్నాం’ అని ఏపీ బీజేపీ అధ్యక్షురా లు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.