Share News

Hirana for two hours : బి.కొత్తకోటలో రెండు గంటలు హైరానా

ABN , Publish Date - Oct 29 , 2024 | 11:09 PM

పారి శుధ్య కార్మికుడు పోలీసులు, ప్రజలను రెండు గంటలపాటు హైరానా పట్టించాడు. స్థానిక ఎస్సీ కాలనీ వాసి కార్మికుడు కోగర శ్రీనివాసులు సాయంత్రం జ్యోతిసర్కిల్‌లో ఉన్న 60 అడుగుల ఎత్తైన వాటర్‌ ట్యాంకు ను ఎక్కాడు. ట్యాంక్‌ పైనుంచి దూకి ఆత్మ హత్య చేసుకోబోతున్నానని పలువురికి ఫో న్‌ చేశాడు. విషయం తెలియడంతో శ్రీనివా సులు భార్య శిరీష, ముగ్గురు పిల్లలు, సీఐ రాజారెడ్డి, సిబ్బంది ట్యాంకు వద్దకు చేరుకు న్నారు.

Hirana for two hours : బి.కొత్తకోటలో రెండు గంటలు హైరానా

కుటుంబ సమస్యలతో వాటర్‌ట్యాంక్‌ ఎక్కిన కార్మికుడు

ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

బి.కొత్తకోట, అక్టోబరు(ఆంధ్రజ్యోతి): పారి శుధ్య కార్మికుడు పోలీసులు, ప్రజలను రెండు గంటలపాటు హైరానా పట్టించాడు. స్థానిక ఎస్సీ కాలనీ వాసి కార్మికుడు కోగర శ్రీనివాసులు సాయంత్రం జ్యోతిసర్కిల్‌లో ఉన్న 60 అడుగుల ఎత్తైన వాటర్‌ ట్యాంకు ను ఎక్కాడు. ట్యాంక్‌ పైనుంచి దూకి ఆత్మ హత్య చేసుకోబోతున్నానని పలువురికి ఫో న్‌ చేశాడు. విషయం తెలియడంతో శ్రీనివా సులు భార్య శిరీష, ముగ్గురు పిల్లలు, సీఐ రాజారెడ్డి, సిబ్బంది ట్యాంకు వద్దకు చేరుకు న్నారు. కానిస్టేబుల్‌ జబీవుల్లా ట్యాంక్‌ ఎక్కి దూకకుండా ఆపగలిగారు. విషయం దావా లనంలా వ్యాపించడంతో జనం పెద్దసంఖ్య లో గుమిగూడారు. దీంతో సర్కిల్‌లో ట్రాఫి క్‌ అంతరాయం కలిగింది. సీఐ మదనపల్లె అగ్నిమాపకదళాన్ని పిలిపించి ట్యాంకునీటి లో దిగిన కార్మికుడిని వలలో బంధించి ఫైర్‌సిబ్బంది కిందికి దింపారు. పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారించగా శ్రీనివాసు లుకు వెన్నెముక ఆపరేషన్‌ జరగడంతో పనులు చేయలేక పోతున్నాడని, భార్య తో సఖ్యతలేక పోవడంతో జీవితంపై విరక్తి చెందాడని, మున్సిపల్‌ కార్యాల యంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తే జీతం పెండింగ్‌లో పెట్టారని శ్రీనివాసులు చెప్పి నట్లు సీఐ తెలిపారు. భార్యాభర్తలకు పోలీ సులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

Updated Date - Oct 29 , 2024 | 11:09 PM