Share News

Chandrababu Naidu: హడ్కో చైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

ABN , Publish Date - Oct 25 , 2024 | 10:12 PM

హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ (హడ్కో) చైర్మన్, ఎండీ సంజయ్ కులశ్రేష్ఠ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు శుక్రవారం అమరావతిలో సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహాయానికి సంబంధించి రూ. 11 వేల కోట్ల ప్యాకేజీపై ఈ సందర్భంగా వారితో చర్చించారు. రాజధాని నగరంలోని 10 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేసేందుకు హడ్కో ఆసక్తి చూపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Chandrababu Naidu: హడ్కో చైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

అమరావతి, అక్టోబర్ 25: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రగతి బాట పట్టించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో వివిధ సంస్థల అధినేతలు, ప్రభుత్వ రంగం సంస్థల ఉన్నతాధికారులతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ఆ క్రమంలో శుక్రవారం హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ (హడ్కో) చైర్మన్, ఎండీ సంజయ్ కులశ్రేష్ఠ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

Also Read: Allu Arjun: హైకోర్టులో అల్లు అర్జున్‌కు తాత్కాలిక ఊరట

Also Read: సోంపు తింటే ఇన్ని లాభాలున్నాయా..?


ఆ క్రమంలో అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల ఆర్థిక సహాయానికి సంబంధించిన ప్యాకేజీపై చర్చించారు. రాజధాని నగరంలోని 10 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేసేందుకు హడ్కో ఆసక్తి చూపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Also Read: Telangana Politics: మా టైం బాగాలేదు.. సర్దుకు పోతున్నాం: జగ్గారెడ్డి

Also Read: Mallikarjun Kharge: ఖర్గేను అవమానించిందంటూ బీజేపీ ఆరోపణలు.. తోసిపుచ్చిన కాంగ్రెస్‌

Also Read: Madhya Pradesh: భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై ..

Also Read: Cyclone Dana: తీరం దాటిన దానా.. పోర్టుల వద్ద హెచ్చరికలు తొలగింపు


ఇక రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులపై సైతం ఈ సమాశంలో చర్చించారు. రాజధాని నిర్మాణం కోసం సీఆర్డ్‌యేకు రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఇప్పటికే హడ్కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం ఆలోచనను ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా హడ్కో చైర్మన్‌కు మంత్రి నారాయణ వివరించిన సంగతి తెలిసిందే. దీంతో అమరావతికి భారీ రుణం ఇచ్చేందుకు అప్పుడే హడ్కో చైర్మన్ సంజయ్ కుల శ్రేష్టి మంత్రి నారాయణకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

For AndhraPradesh News and Telugu News

Updated Date - Oct 25 , 2024 | 10:15 PM