Tirumala Trek Tragedy : తిరుమల నడక దారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
ABN , Publish Date - Dec 15 , 2024 | 04:06 AM
తిరుమల నడకమార్గంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శనివారం మృతి చెందాడు. బెంగళూరుకు చెందిన నవనీత్(34) హైదరాబాద్‌కు
ABN Desk : తిరుమల నడకమార్గంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శనివారం మృతి చెందాడు. బెంగళూరుకు చెందిన నవనీత్(34) హైదరాబాద్‌కు చెందిన స్నేహితుడు మహే ష్‍తో కలిసి అలిపిరి నుంచి శనివారం ఉదయం 8.30 గంటలకు తిరుమలకు బయలుదేరాడు. తిరుమలకు చేరుకోవడానికి 50 మెట్ల దూరంలో ఉండగా హఠాత్తుగా నవనీత్ కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్ ద్వారా తిరుమల అపోలో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చెందిన రవికుమార్ అనే భక్తుడు అలిపిరి కాలినడక మార్గంలోనే మృతి చెందాడు.