Share News

AP News: ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 19 , 2024 | 10:44 AM

గత ఐదేళ్లలో వైసీపీ సర్కారు.. పర్యాటక శాఖను నిర్లక్ష్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి సర్కారు నడుంబిగించిందని ఆయన చెప్పారు.

AP News: ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Kandula Ddurgesh

రాజమండ్రి: గత ఐదేళ్లలో వైసీపీ సర్కారు పర్యాటక శాఖను నిర్లక్ష్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి సర్కారు నడుంబిగించిందని ఆయన చెప్పారు. ఈనెల 27 న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. అక్టోబర్ 15 కల్లా టూరిజంపై డీపీఆర్ రూపొందించి కేంద్రానికి అందజేస్తామని ఆయన చెప్పారు.


శ్రీశైలం ఐకానిక్ టూరిజం, ఉమ్మడి గోదావరి జిల్లాలను అఖండ గోదావరిగా, బాపట్ల కారిడార్, సంగమేశ్వరాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు రూ.250 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి అందజేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. రూ.400 కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామని అన్నారు. స్వదేశీ టూరీజంతో అరకు, లంబసింగి ప్రాంతాలను అభివృద్ది చేస్తామని ఆయన చెప్పారు.


వాటర్ స్పోర్ట్స్‌ను అభివృద్ది చేస్తాం..

వాటర్ స్పోర్ట్స్‌ను అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ‘ప్రసాద్ టూరిజం’ కింద రూ.25 కోట్లతోఆధ్యాత్మిక క్షేత్రం అన్నవరంను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేవాలయాల సందర్శన కోసం ఏపీటీడీసి ద్వారా ఏసీ బస్సులు ఏర్పాటు చేస్తామని, ఏపీలో ఉన్న 15 హరిత రిసార్ట్స్‌ను అభివృద్ది చేస్తామని చెప్పారు. ‘‘ ఏపీలో సినిమా షూటింగ్‌ల కోసం సింగిల్ విండో విధానంలో సహకరిస్తాం. తెలుగు సినీపరిశ్రమకు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుంది. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహిస్తాం. కడియపులంకలో నర్సరీలను పర్యాటకరంగంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నాం. పర్యాటక శాఖలో అవినీతిని ప్రక్షాళన చేస్తాం’’ అని అన్నారు.

Updated Date - Sep 19 , 2024 | 10:52 AM