రాజమండ్రి టు ఢిల్లీ.. నేటి నుంచి ఇండిగో ఎయిర్‌బస్
ABN , Publish Date - Dec 12 , 2024 | 02:43 AM
రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి గురువారం నుంచి ఇండిగో ఎయిర్‌బస్ సర్వీసు మొదలవుతుందని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు చెప్పారు.
రాజమహేంద్రవరం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి గురువారం నుంచి ఇండిగో ఎయిర్‌బస్ సర్వీసు మొదలవుతుందని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు చెప్పారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు మాట్లాడుతూ గురువారం ఉదయం 6.30కు ఢిల్లీ నుంచి, మధురపూడి నుంచి ఉదయం 9కి ఢిల్లీ బయలుదేరుతుందన్నారు.