Home » Indigo
Indigo Flight: సౌదీ నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికులు హల్చల్ చేశారు. దీంతో సహచర ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గరయ్యారు. విమానంలోని అత్యవసర తలుపును తీసేందుకు అతడు ప్రయత్నించారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో విమానం ల్యాండ్ కాగానే.. ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ఇండిగో విమానంలో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు నాలుగు గంటల పాటు పడిగాపులు కాశారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు సరఫరా చేసే ఓ సంస్థ ప్రమాణాలు పాటించడం లేదని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ (సీఎ్ఫఎస్)తెలంగాణ టాస్క్‌ఫోర్స్ బృందం నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది.
Vijayawada: గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాలు చక్కర్లు కొడుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. విమానాశ్రయం మొత్తాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో ల్యాండింగ్‌కు సిగ్నల్ అందక ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి.
Andhrapradesh: దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్‌పోర్టు మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం గాల్లోనే చెక్కర్లు కొడుతున్నాయి.
రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి గురువారం నుంచి ఇండిగో ఎయిర్‌బస్ సర్వీసు మొదలవుతుందని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు చెప్పారు.
ఓ కంపెనీ ఇటివల 109 గ్లోబల్ ఎయిర్‌లైన్స్ జాబితాను ప్రకటించింది. దీనిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాబితాలో ఇండియాకు చెందిన పలు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
చెన్నై- విశాఖ, బెంగళూరు-విశాఖ ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో.. ప్రయాణికులు, ఎయిర్పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దేశవ్యాప్తంగా పలు విమానాల్లో బాంబులు పెట్టామంటూ ఎయిర్ పోర్ట్‌లకు బెదిరింపులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈరోజు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో ఫ్లైట్‌కి బాంబు బెదిరింపు కాల్ చేశారు. ఎయిర్ పోర్టు అధికారులు విమానాన్ని పరిశీలించారు
భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. అంతకంతకూ ఎక్కువై పోతున్నాయి. ఇవాళ (ఆదివారం) ఒక్క రోజే కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.