Share News

చింతపర్తి ఆస్పత్రి తనిఖీ

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:25 PM

వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం డీఎంహెచవో డాక్టర్‌ కొండయ్య, డిప్యూటీ డీఎంహెచవో డాక్టర్‌ రమేష్‌బాబులు ఆక స్మిక తనిఖీలు నిర్వహించారు.

చింతపర్తి ఆస్పత్రి తనిఖీ
చింతపర్తి పీహెచసీలో రికార్డులు పరిశీలిస్తున్న డీఎంహెచవో కొండయ్య

వాల్మీకిపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం డీఎంహెచవో డాక్టర్‌ కొండయ్య, డిప్యూటీ డీఎంహెచవో డాక్టర్‌ రమేష్‌బాబులు ఆక స్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆస్పత్రిలోని రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇటీ వల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో గ్రామీణ ప్రాతాల్లో వైద్య శిబిరాలు నిర్వ హించి సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవ గాహన కల్పించాలని ఆదేశించారు. వర్షాలు ఆగిన తర్వాత అంటువ్యాదులు ప్రబలే అకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పాము, కుక్క కాటు అత్యవసర మందులు అందుబాటు లో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈకార్యక్రమంలో వైద్యులు డాక్టర్‌ శ్రీవిద్య, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:25 PM