Inter Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఇంటర్ రిజల్ట్స్.. పూర్తి వివరాలివే..
ABN , Publish Date - Apr 11 , 2024 | 04:28 PM
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు. ముందుగా ఈ నెల 15న ఫలితాలు విడుదల చేస్తారని సమాచారం రాగా, తాజాగా 12న ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్ ప్రక్రియ పూర్తైంది. మూల్యాంకనాన్ని మరోసారి పరిశీలించి ఫలితాలు విడుదల చేయనున్నారు.
Haryana: స్కూల్ బస్ బోల్తా.. ఏడుగురు చిన్నారులు మృతి..
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు మార్చి 1 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి నెలలోనే ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఫలితాల విడుదల అనంతరం ఇంటర్ విద్యార్థులు https://bieap.apcfss.in/Index.do లో చెక్ చేసుకోవచ్చు.
POK: పీఓకే మాదే.. ఒక్క అంగుళమూ కదలనివ్వం.. చైనాకు రాజ్ నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఫలితాలు వెల్లడించేందుకు ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఫలితాల విడుదలతో రాజకీయ నాయకులు ప్రమేయం ఉండదు కాబట్టి ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులే ఈసారి ఫలితాలు విడుదల చేయనున్నారు. గత ఏడాది ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 26న విడుదల చేశారు. కాగా ఈ ఏడాది ముందుగానే ఫలితాలు విడుదల చేయడం విశేషం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.