Home » ABN
అసోంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోట్ల రూపాయిల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. సోప్ బాక్స్‌ల్లో వీటిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్రమైయ్యాయి. ఆ క్రమంలో పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు అనే తేడా లేకుండా అన్నింటికి బాంబు బెదిరింపులు వెల్లువెత్తుతోన్నాయి.
ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం వ్యవహరంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతించారు.
కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఎన్డీయే మిత్ర పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) అధినేతలు, సీఎం చంద్రబాబు, సీఎం నితీష్ కుమారుకు ఆయన సూటిగా ప్రశ్నను సంధించారు.
సభలో ప్రతిపక్ష నాయకులతో మాట్లాడతాం కానీ.. ఈ పిల్లలతో ఏం మాట్లాడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు సిద్దంగా ఉన్నానన్నారు. తన రాజకీయ జీవితంలో ఒక్క రూపాయికి కూడా అవినీతికి పాల్పడ లేదని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
లంచం ఆరోపణలు వెల్లువెత్తినా.. గౌతమ్ అదానీ వ్యవహారంలో కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకు నిరసనగా ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏఐసీసీ పిలుపునిచ్చింది.
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వార్ కొనసాగుతోంది. కుటుంబంలో విబేధాలపై మోహన్ బాబు భార్య నిర్మల స్పందించారు. మనోజ్ ఫిర్యాదుల్లో వాస్తవం లేదన్నారు. ఈ ఘటనలో మంచు విష్ణు ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తన బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగానే విష్ణు.. జల్ పల్లిలోని తన నివాసానికి వచ్చారని చెప్పారు.
పల్నాడ్ జిల్లాలోని నకిరేకల్ లో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ఉద్యోగం కోసం ఓ యువతి తన ఇద్దరు సోదరులను హత్య చేసింది. అనంతరం ఆయా మృతదేహాలను కాల్వలో పడేసింది. కొద్ది రోజుల క్రితం నకిరేకల్ లో అనారోగ్యంతో పోలరాజు మరణించారు. పోలరాజు ఉద్యోగం కోసం ... కుమార్తె కృష్ణవేడి మర్డర్ స్కెచ్ వేసింది.
కూర్చుని మాట్లాడుకుందామంటే.. దురుసుగా రిప్లైలు పెట్టారని హీరో మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి.. ప్రతి అంశాన్ని వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆగలేనన్నారు. ప్రతి విషయాన్ని వివరాస్తాని ఆయన పేర్కొన్నారు.
మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్‌పై ఆదివారం దాడి జరిగింది. ఈ నేపథ్యంలో అతడు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కానీ పరిస్థితి నెలకొంది. మరోవైపు మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ఇప్పటికే దుబాయి నుంచి హైదారబాద్ తిరిగి వచ్చారు. మరికాసేపట్లో జల్పల్లిలోని నివాసానికి ఆయన చేరుకోనున్నారు.