Investigation into the Death of a woman : ఆస్పత్రిలో మహిళ మృతిపై విచారణ
ABN , Publish Date - Nov 01 , 2024 | 11:01 PM
స్థానిక ఎస్‌కేఆర్ ఆస్పత్రిలో వైద్యం పొం దుతూ మహిళ మృతి చెంద డం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె మృతి చెందిందని ఆరోపణలు వెల్తువెత్తడంతో కలెక్టర్ చామకూరి శ్రీధర్ విచారణకు ఆదే శించారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు
విచారణకు ఆదేశించిన కలెక్టర్
పీలేరు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎస్‌కేఆర్ ఆస్పత్రిలో వైద్యం పొం దుతూ మహిళ మృతి చెంద డం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె మృతి చెందిందని ఆరోపణలు వెల్తువెత్తడంతో కలెక్టర్ చామకూరి శ్రీధర్ విచారణకు ఆదే శించారు. దీంతో జిల్లా ఇమ్యూనై జేషన్ అధికారి డాక్టర్ ఉషశ్రీ, పీలే రు తహసీల్దారు భీమేశ్వరరావు, తలుపుల పీహెచ్‌సీ వైద్యాధికారి రమేశ్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. వివరాల్లోకెళితే...
గోరంట్లపల్లె పంచాయతీ కురవపల్లెకు చెందిన లక్ష్మీదేవి(55) తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండడంతో బంధువు లు బుధవారం ఉదయం ఆమెను ఎస్‌కే ఆర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే ఆమె పరిస్థితి బాగలేకపోవడంతో వైద్యు లు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి పేగు ల్లో నెలకొన్న అంతర్గత రక్తస్రావం కార ణంగా నొప్పి వస్తోందని, గుండె, కిడ్నీల సమస్యలతో ఆమె బాధపడుతోందని నిర్ధా రించినట్లు వైద్యులు చెబుతున్నారు. అయి తే ఏదైనా పెద్ద ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తే ఆర్థిక స్తోమతలేదని, ఇక్కడే ఆపరేషన్ చేయాలని కోరడంతో ఆపరేషన్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
కొద్దిసేపటి కి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లెలోని ఓ హృద్రోగ నిపుణుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ చికి త్స పొందుతూ గురువారం ఉదయం ఆమె కన్నుమూసింది. దీంతో పీలేరులో జరిగిన వైద్యంలో లోపాలున్నాయని, ఈ కారణంగానే ఆమె చనిపోయిందని ఆరోపి స్తూ బంధువులు మృతదేహంతో ఆస్పత్రి చేరుకున్నారు. పెద్దఎత్తున జనం గూమి గూడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పారు. జరిగిన సంఘటనపై ఆరా తీశారు. అయితే ఎస్‌కేఆర్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిం దని ప్రజాసంఘాలు, సామాజిక మాధ్య మాల్లో పోస్టులు పెట్టడం, జిల్లా ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంఘటనపై సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక అందజేయాలని కలెక్టర్ జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిని ఆదేశిం చారు. శుక్రవారం ఉదయం ఆమె పీలేరు తహసీల్దారు భీమేశ్వరరావు, తలపుల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రమేశ్‌రెడ్డి సమక్షంలో ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ వసీంను విచారించారు. అనంతరం పాత్రి కేయులతో మాట్లాడుతూ విచార ణ సారాంశాన్ని నివేదిక కలెక్టర్ కు అందజేస్తామని తెలిపారు.
ఆరోపణలు తగదు : - ఐఎంఏ అధ్యక్షుడు
ఏదైనా సంఘటన జరిగినప్పుడు పూర్వా పరాలు విచారించకుండా కొందరు సా మాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం బాధిస్తోందని ఐఎంఏ పీలేరు శాఖ అధ్య క్షుడు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఐఎం ఏ సభ్యులతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సంఘటన జరిగినప్పుడు వైద్యుల వివరణ లేకుండా పోస్టులు పెట్ట డం సరికాదన్నారు. మహిళ ‘హాలో విస్క స్ పెర్‌ఫోరేషన్, సెప్‌సిస్, సీకేడీ, సీఓపీడీ’ వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వ చ్చిందన్నారు. ఆ లక్షణాలున్న వారిలో 50 శాతం హైరిస్కు ఉంటుందని తెలిపా రు. సమావేశంలో వైద్యులు రాజా సాహె బ్, భారతి, ఈశ్వర సురేంద్ర, శశి, భరత్, వసీం, తదితరులు పాల్గొన్నారు.