Home » Pileru
వ్యవసాయం జూదమంటున్న తరుణంలో పలువురు రైతులకు రైతు శివశంకర్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయ్యవారిపల్లె రైతు శివశంకర్‌రెడ్డి 15 ఎకరాల పొలంలో తరతరాలుగా వస్తున్న వ్యవసాయాన్ని అందిపుచ్చుకుని వేలాది మంది రైతులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.
స్థానిక ఎస్‌కేఆర్ ఆస్పత్రిలో వైద్యం పొం దుతూ మహిళ మృతి చెంద డం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె మృతి చెందిందని ఆరోపణలు వెల్తువెత్తడంతో కలెక్టర్ చామకూరి శ్రీధర్ విచారణకు ఆదే శించారు.
విద్యార్థులు చదువుకునే దశ నుంచే మొక్కలు నాటి పరిరక్షించడం అలవ ర్చుకోవాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సూచించారు.
పీలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేసినట్లు పీలేరు పంచాయతీ ఈవో గురుమోహన్ తెలిపారు.
తిరుపతి జిల్లా, పీలేరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించేసారు. అయితే వైసీపీ అల్లరి మూకలే బ్యానర్లను చించి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బ్యానర్లు చించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు అందరి చూపు ఆ నియోజకవర్గం వైపే.. ఇక్కడ నల్లారి, చింతల కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా రాజకీయ వైరం సాగుతోంది. ఈ దఫా ఎన్నికల్లో నల్లారి సోదరుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా, ఆయన సోదరుడు నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి పీలేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడం..
Andhrapradesh: ‘‘రా.. కదలిరా’’ పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
తిరుపతి: ‘‘రా.. కదలిరా’’ పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన, తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా, పీలేరులో చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో భద్రతా వైఫల్యం తలెత్తింది.
Andhrapradesh: ‘‘రా.. కదలిరా’’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ తీరు, సీఎం జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
పీలేరు భూఅక్రమాలపై సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తు జరపాలని టీడీపీ యువనేత నారా లోకేష్ డిమాండ్ చేశారు.