Viveka Case: వివేక హత్య కేసులో దస్తగిరి పిటిషన్‌పై విచారణ
ABN , Publish Date - Jul 18 , 2024 | 12:15 PM
మాజీ మంత్రి వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అప్రూవర్‌గా మారినందున నిందితుల జాబితా నుంచి తనని తొలగించాలని దస్తగిరి కోరుతున్నాడు.
హైదరాబాద్: మాజీ మంత్రి వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అప్రూవర్‌గా మారినందున నిందితుల జాబితా నుంచి తనని తొలగించాలని దస్తగిరి కోరుతున్నాడు. వివేక హత్య కేసులో దస్తగిరిని సాక్షిగా పరిగణించాలని ఆయన తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో విచారణ పూర్తి చేసి జడ్జిమెంట్ వెల్లడించే సమయానికి న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో మరోసారి రీ ఓపెన్ చేసి సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే అప్రూవర్ దస్తగిరి, సీబీఐ వాదనలను న్యాయస్థానం విన్నది.
వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారినప్పటి నుంచి ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆయన తండ్రిపై సైతం దాడి జరిగింది. ఆ తరువాత దస్తగిరి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భీమ్ పార్టీలో చేరి పులివెందుల నుంచి పోటీ చేశారు. ఆ తరువాత ఈ హత్యకేసులో కడప ఎంపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయించాలని దస్తగిరి శత విధాలుగా యత్నిస్తున్నారు. వైసీపీ నేతల కారణంగా తనకు, త న కుటుంబానికి ప్రాణ హాని ఉందని రక్షణ కల్పించాలి పలుమార్లు పోలీసులను కోరాడు. 2021, 2022లో ఈ కేసులో సీబీఐకి రెండు వాంగ్మూలాలు ఇచ్చినప్పడటి నుంచే తనపై కక్ష కట్టారని దస్తగిరి పేర్కొన్నాడు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత బాబాయి అయిన వివేకానంద రెడ్డి హత్య 2019లో ఏపీ ఎన్నికలకు కేవలం కొన్ని వారాల ముందు జరిగింది. తొలుత ఆయనది హార్ట్ అటాక్ అని చెప్పారు. ఆ తరువాత కానీ అసలు విషయం బయటకు రాలేదు. ఎంపీ ఒంటరిగా ఉన్న సమయంలో అదను చూసి ఆయన ఇంట్లోకి వెళ్లి హత్య చేసి దర్జాగా తిరిగొచ్చారు. వివేకా కూతురు సునీత తన తండ్రికి న్యాయం జరగాలంటూ ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి...
AP News: వినుకొండలో నడిరోడ్డుపై హత్య ఉదంతంపై స్పందించిన టీడీపీ
Read Latest AP News And Telugu News