Share News

YS Jagan: పోలవరం జాప్యానికి జగన్ కారణం.. పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్రం

ABN , Publish Date - Jul 25 , 2024 | 01:49 PM

పోలవరం జాప్యానికి కారణం మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డేనని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. ఈ న్యూస్ ఏపీలో సంచలనంగా మారింది.

YS Jagan: పోలవరం జాప్యానికి జగన్ కారణం.. పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్రం

ఢిల్లీ: పోలవరం జాప్యానికి కారణం మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే (YS Jagan)నని పార్లమెంట్ (Parliament) సాక్షిగా కేంద్రం (Central Government) స్పష్టం చేసింది. ఈ న్యూస్ ఏపీలో సంచలనంగా మారింది. ఇప్పటి వరకూ కేంద్రంపై నెపం నెడుతూ వచ్చిన జగన్‌కు రివర్స్‌లో కేంద్రం గట్టి షాకే ఇచ్చింది. మొత్తం జగనే చేశారని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ( CR Patil) లోక్‌సభ (Loksabha)లో ఇవాళ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ వైఫల్యమే పోలవరం జాప్యానికి కారణమని సీఆర్ పాటిల్ వెల్లడించారు. లోకసభలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు (MP Lavu Srikrishnadevarayalu) , హరీష్‌లు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పై విధంగా సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణం ఆలస్యం కావడానికి గుత్తేదారును మార్చడం కారణం అని కూడా కేంద్రం స్పష్టం చేసింది.


లోకసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2021లో ఐఐటీ హైదరాబాద్ (Hyderabad) ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టు ఆలస్యానికి కారణాలు పేర్కొనడం జరిగిందని కేంద్ర మంత్రి (Central Minister) స్పష్టం చేశారు. గుత్తేదారును మార్చడంతో పాటు... భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల్లో జాప్యం జరిగిందన్నారు. ప్రాజెక్టు తొలిదశ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని పార్లమెంటుకు జలశక్తి శాఖ చెప్పింది. గత మూడేళ్ళలో రూ. 8,044.31 కోట్లు కేంద్రం నుంచి ఇచ్చినట్లు సీఆర్ పాటిల్ తెలిపారు. మూడేళ్ల పనుల పురోగతి వివరాలను కూడా సమాధానంలో పొందుపరిచారు.


2021-22 నుంచి మూడేళ్ళలో ప్రాజెక్టు ప్రధాన పనుల్లో 21శాతం మట్టి పనులు, కాంక్రీటు పనులు కేవలం 5.3 శాతం జరిగాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కుడి కాలువకు లైనింగ్ పనులు 1.72 శాతం, స్ట్రక్చర్స్ 0.39 శాతం జరిగాయన్నారు. ఎడమ కాలువకు మట్టి పనులు 0.30 శాతం, లైనింగ్ 1.18 శాతం, స్ట్రక్చర్స్ 3.33 శాతం జరిగాయన్నారు. భూసేకరణ 0.22 శాతం, సహాయ పునరావాస కార్యక్రమం 8 శాతం జరిగిందని వివరాలను కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టు పనుల పరిశీలన, ఆలస్యానికి కారణలు తెలుసుకోవడానికి 2021 ఆగస్టు లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఐఐటీ హైదరాబాద్ నుంచి సహకారం తీసుకున్నట్లు సీఆర్ పాటిల్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

గంజాయి మత్తులో అనేక దారుణాలు: హోంమంత్రి అనిత

పవన్ తాటతీస్తున్నారు: పృథ్వీరాజ్

జగన్ బూమ్ బూమ్ రహస్యం...

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 25 , 2024 | 01:49 PM