Share News

న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైౖర్మన్‌గా జస్టిస్‌ దుర్గాప్రసాదరావు

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:20 AM

ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైౖర్మన్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యూ దుర్గాప్రసాదరావు నియమితులయ్యారు.

న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైౖర్మన్‌గా జస్టిస్‌ దుర్గాప్రసాదరావు

అమరావతి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైౖర్మన్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యూ దుర్గాప్రసాదరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తిని కార్యనిర్వాహక చైర్మన్‌గా నియమించడం సంప్రదాయంగా వస్తుంది. ఇటీవల వరకు ఆ బాధ్యతలను నిర్వహించిన జస్టిస్‌ ఏవీ శేషసాయి పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో సీనియర్‌న్యాయమూర్తి అయిన జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ ఆ పోస్టులో నియమితులయ్యారు.

Updated Date - Jun 19 , 2024 | 04:20 AM