Share News

సత్యసాయి ఆధ్యాత్మిక విద్య అందరికీ ఆదర్శం

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:33 AM

సత్యసాయి సంస్థలు అందిస్తున్న ఆధ్యాత్మిక విద్యా విధానం అందరికీ ఆదర్శమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యపల్లి నంద అన్నారు.

సత్యసాయి ఆధ్యాత్మిక విద్య అందరికీ ఆదర్శం

  • తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నంద

  • పుట్టపర్తిలో ఘనంగా మహిళా దినోత్సవం

పుట్టపర్తి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సత్యసాయి సంస్థలు అందిస్తున్న ఆధ్యాత్మిక విద్యా విధానం అందరికీ ఆదర్శమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యపల్లి నంద అన్నారు. మహిళలు సామాజిక, ఆధ్యాత్మిక భావాలతో ఉన్నత స్థానాలను అధిష్ఠిస్తున్నారని ఆమె అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయి కుల్వంత్‌ మందిరంలో సత్యసాయు జయంతి వేడుకల్లో రెండో రోజు మంగళవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల అనంతపురం మహిళా క్యాంపస్‌ విద్యార్థులు వేద పారాయణ, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి.. సాయి కుల్వంత్‌కు చేరుకున్నారు. అనంతరం జస్టిస్‌ నంద జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. 1995 నవంబరు 19న మొదటిసారి భగవాన్‌ సత్యసాయు మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారని తెలిపారు. ఆధ్యాత్మిక, బాలవికాస్‌ విద్యా సంస్థల్లో వేలాది మంది మహిళలు బోధకులుగా తమ వంతు సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. నేటి సమాజంలో మహిళలు ఆర్థిక, సామాజిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధంచారని న్యాయమూర్తి తెలిపారు.

Updated Date - Nov 20 , 2024 | 04:33 AM