AP News: చంద్రబాబు ఇంటి దగ్గర కేఏ పాల్ హల్‌చల్
ABN , Publish Date - Mar 11 , 2024 | 07:43 PM
మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ హల్‌చల్ చేశారు. హైకోర్ట్‌లో పబ్లిక్ రైటికేషన్ పిల్ వేశానని, దాని మీద రేపు (మంగళవారం) విచారణ జరుగుతుందని అన్నారు. ‘‘ ఎలక్షన్ నిర్వహించడం కోసం ముగ్గురు కమిషనర్స్ ఉండాలి కానీ ఒక్కరే ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ఎన్నికలు జరపకూడదు’’ అని అన్నారు.
అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ హల్‌చల్ చేశారు. హైకోర్ట్‌లో పబ్లిక్ రైటికేషన్ పిల్ వేశానని, దాని మీద రేపు (మంగళవారం) విచారణ జరుగుతుందని అన్నారు. ‘‘ ఎలక్షన్ నిర్వహించడం కోసం ముగ్గురు కమిషనర్స్ ఉండాలి కానీ ఒక్కరే ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ఎన్నికలు జరపకూడదు. కాపులు అంతా ప్రజాశాంతి పార్టీలోకి రావాలని కోరుతున్నాను. ముద్రగడ పద్మనాభం అలోచించి ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆహ్వానం పలుకుతున్నాను’’ అని కేఎల్ పాల్ అన్నారు.
పాల్ రావాలి.. పాలన మారాలి అని ఆయన వ్యాఖ్యానించారు. సీనియర్ నాయకుడు బాబు మోహన్ తన పార్టీలోకి వచ్చాడని, ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తనను కలవాలని అన్నారు.