KA Paul: కేఏ పాల్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అందరూ నమ్ముతున్నారు
ABN , Publish Date - Feb 20 , 2024 | 06:23 PM
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేఏ పాల్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అందరూ నమ్ముతున్నారని అన్నారు. ఇదే సమయంలో.. చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుని ప్రస్తావించారు. ఎన్నికల బాండ్‌లలో క్విడ్ ప్రోకో ఉందని తాను అనేకసార్లు మీడియా సమావేశాల్లో చెప్పానని, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ వ్యాఖ్యలే చేసిందని అన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేఏ పాల్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అందరూ నమ్ముతున్నారని అన్నారు. ఇదే సమయంలో.. చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుని ప్రస్తావించారు. ఎన్నికల బాండ్‌లలో క్విడ్ ప్రోకో ఉందని తాను అనేకసార్లు మీడియా సమావేశాల్లో చెప్పానని, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ వ్యాఖ్యలే చేసిందని అన్నారు. బీజేపీకి 6 వేల 6 వందల కోట్ల రూపాయల వైట్ మనీ ఇచ్చారని, ఇక నల్లధనం లెక్కే లేదని ఆరోపించారు.
అసలు అదాని ఎవరు? ఆయనకే స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారు? అని కేఏ పాల్ ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని ఆదాని నడిపిస్తున్నాడా? అని నిలదీశారు. అదానీ గానీ, ఉక్కు శాఖ మంత్రి గానీ వస్తే జగన్ రిసీవ్ చేసుకుంటారని.. స్టీల్ ప్లాంట్ కోసం కేసు వేస్తే, ఆ కేసు తీసుకున్న జడ్జి కూడా బదిలీ అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బలంగా లేవని, అందుకే మోదీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని తూర్పారపట్టారు. ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్న ఈ పార్టీలకు ఎందుకు ఓటు వేస్తారో ప్రజలు చెప్పాలని అడిగారు. నీతి, నిజాయితీ ఉన్న మీడియా ఉంది కాబట్టి.. తాను ప్రజల కోసం తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పోరాడుతున్నానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి ఎవరొచ్చినా పాపం తగులుతుందని హెచ్చరించారు.
తాను అన్‌ఫిట్ అని, తనకు జ్యుడిషియల్ నాలెడ్జ్ లేదని, తనపై ఈ వ్యాఖ్యలు చేసిన ఆ జడ్జి కుటుంబాన్ని దేవుడు శపించాలని కేఏల్ పాల్ మండిపడ్డారు. ఏపీలో పుట్టిన తనకు ఏపీలో ఆర్గ్యూ చేయడానికి తాను అర్హుడిని కానా? అని ప్రశ్నించారు. మీ కుటుంబాలు నా శాపానికి గురి కావొద్దని సూచించారు. తన పిటిషన్‌ను రిజిష్టర్ చేయనని అంటున్నారన్నారు. తనని విశాఖ ఎంపీగా చేస్తే.. పార్లమెంట్‌ని స్తంభింపజేస్తానని వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరి ఆర్కేకి కాంగ్రెస్‌లో డీల్ కుదరకపోవడం వల్ల.. మళ్లీ వైపీసీకి వెళ్లినట్టున్నాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి దరిద్రులు తమ స్వార్థం కోసం పూటకో పార్టీ మారుతున్నారని కేఏ పాల్ దుయ్యబట్టారు.