Share News

శ్రమజీవుల పక్షాన నిరంతర పోరాటం

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:49 PM

శ్రమజీవుల పక్షాన సీపీఐ నిరంతర పోరాటం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు అన్నారు.

శ్రమజీవుల పక్షాన నిరంతర పోరాటం
రాయచోటిలో సీపీఐ శత వార్షికోత్సవాల జెండాను ఆవిష్కరించి మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి నరసింహులు

సీపీఐ జిల్లా కార్యదర్శి నరసింహులు

రాయచోటిటౌన్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): శ్రమజీవుల పక్షాన సీపీఐ నిరంతర పోరాటం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు అన్నారు. సీపీఐ శత వార్షికోత్సవాల సందర్భంగా గురువారం ఆయన రాయచోటి పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి గేటు సమీపంలో జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహులు, నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నిర్బంధంలో పుట్టి పెరిగిన పార్టీ అని, దున్నే వారిదే భూమి అనే నినాదంతో భూపోరాటం చేసి వేలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేసినట్లు కొని యాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మర్రి సుమిత్ర, కోటేశ్వరరావు, సుధీర్‌కుమార్‌, జిల్లా సమితి సభ్యులు వెంకటేశ్‌, రంగారెడ్డి, వెంకటరమణ, సీపీఐ పట్టణ కార్యదర్శి జగన్‌, బాబు, ఆంజనేయులు, మహిళా సమాఖ్య నాయకురాలు ప్రమీల పాల్గొన్నారు.

రాజంపేట: పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్‌, సమితి కార్యదర్శి ఎం.శివరామకృష్ణదేవర ఆధ్వర్యంలో సీపీఐ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా అనేకమంది ఎర్రజెండా నీడలో పోరాటాలు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి సికిందర్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి చంద్ర, పి.సుబ్రమణ్యం, సీపీఐ నాయకులు నాగేశ్వరరావు, శివయ్య, వెంకటసుబ్బయ్య, రమణ, ఏఐటీయూసీ కార్యకర్తలు పాల్గొన్నారు.

లక్కిరెడ్డిపల్లె: సీపీఐ ఆవిర్భావ వేడుకలు గురువారం లక్కిరెడ్డిపల్లెలో మూడు రోడ్ల కూడలిలో సీపీఐ నాయకుడు సిద్దిగాళ్ల శ్రీనివాసులు జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు.

గాలివీడు: సీపీఐ ఆవిర్భావ వేడుకలు గాలివీడులో సీపీఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సిద్దిగాళ్ల శ్రీనివాసులు పార్టీ జెండాను ఆవిష్కరించారు.

సుండుపల్లె: పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడే ఏకైక పార్టీ సీపీఐ అని ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు విశ్వనాధ్‌ నాయక్‌ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని బస్టాండు వద్ద సీపీఐ జెండాను ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

పుల్లంపేట: మండల పరిధిలోని దళవాయిపల్లెలో గురువారం సీపీఐ శతజయంతి ఉత్సవాలను మండల కార్యదర్శి సెల్వంకుమార్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల సీపీఐ నాయకులు లక్ష్మీదేవి, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 11:49 PM