డ్రైవరు చాకచక్యంతో త ప్పిన పెను ప్రమా దం
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:54 PM
స్థానిక ఓ ప్రైవేటు పాఠశాల బస్సు టైరు రాడ్ ఎండ్ ఉండిపోవడంతో డ్రైవరు చాకచక్యంగా చెట్టుకు తగిలించి ప్రమాదాన్ని నివారించాడు.
స్వల్పగాయాలతో బయటపడిన విద్యార్థులు
క మలాపురం రూరల్, అక్టోబరు 1: స్థానిక ఓ ప్రైవేటు పాఠశాల బస్సు టైరు రాడ్ ఎండ్ ఉండిపోవడంతో డ్రైవరు చాకచక్యంగా చెట్టుకు తగిలించి ప్రమాదాన్ని నివారించాడు. ఈ సంఘటనలో పిల్లలకు స్వల్పగాయాలు కాగా డ్రైవరు బస్సు సీట్‌లో ఇరుక్కోవడంతో ఎక్స్‌కవేటర్ సహాయంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది బయటకు తీశారు. పాఠశాల బస్సు రోజు మాదిరిగానే పల్లెలకు పోయి పిల్లలను ఎక్కించుకుని స్కూలుకు వస్తుండగా మంగళవారం జంగంపల్లె వద్ద బస్సు టైరు రాడ్ ఎండ్ ఊడిపోయింది. విష యాన్ని గమనించిన డ్రైవ రు చాకచక్యంగా రోడ్డు పక్క ఉన్న చెట్టుకు ఢీకొనడంతో పెను ప్రమా దం తప్పింది. బస్సు కొంచెం ముందుకు వెళ్లితే దాదాపు పది అడుగుల గోతిలో పడి పెను ప్రమాదమే జరిగేది. అదృష్టవశాత్తు స్కూలు పిల్లలకు స్వల్పగాయాలు కాగా డ్రైవరు క్యాబినలో ఇరుక్కుపోయాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది 108 సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని డ్రైవరును ఎక్స్‌కవేటర్‌తో బయటికి తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాలం చెల్లిన బస్సులను తిప్పుతూ స్కూలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ విద్యతో వ్యాపారం చేస్తూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.