Share News

నాగిరెడ్డి పల్లెకు వైద్యశాల మంజూరు చేయాలి

ABN , Publish Date - Sep 30 , 2024 | 11:02 PM

మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీకి ప్రభుత్వ వైద్యశాల మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌కు ఆ పంచాయతీ సర్పంచ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు వినతిపత్రం అందజేశారు.

నాగిరెడ్డి పల్లెకు వైద్యశాల మంజూరు చేయాలి
మంత్రికి సమస్యలు వివరిస్తున్న సర్పంచు జంబు సూర్యనారాయణ

నందలూరు, సెప్టెంబరు 30 :మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీకి ప్రభుత్వ వైద్యశాల మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌కు ఆ పంచాయతీ సర్పంచ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు వినతిపత్రం అందజేశారు. సోమవారం కడపకు వచ్చిన మంత్రి సత్యకుమార్‌ను వారు కలిశారు. నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీలోని నాగిరెడ్డిపల్లె, కుమ్మరపల్లె, ఇసుకపల్లె, హరిజనవాడ, నారాయణరాజుపేట, అరవపల్లె, గాంధీనగర్‌, తోటపాలెం, బస్టాండులతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో దాదాపు 20 వేల మంది జనాభా ఉన్నారని, ఈ ప్రాంతంలో వైద్యశాల లేకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. వైద్యశాల మంజూరు తో పంచాయతీ ప్రజలతో పాటు పాటూరు, తొగురుపేట గ్రామస్థులకు కూడా మేలు కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యశాలను మంజూరు చేయాలని మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ విషయంపై మంత్రి సానులకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతురాజు మస్తానయ్య, జిల్లా మాజీ వక్ఫ్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ అమీర్‌, బాజపా యువ నాయకులు గోపినేని హిమగిరినాధ్‌యాదవ్‌, ప్రసాద్‌, మల్లి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 11:02 PM