ఉపాధ్యాయుడి మృతిపై సమగ్ర విచారణ జరపాలి
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:37 AM
రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఇజాజ్ అహమ్మద్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
కడప ఎడ్యుకేషన, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఇజాజ్ అహమ్మద్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటిలో మృతిచెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అహ్మద్‌కు గురువారం రామచంద్రారెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో 9వతరగతి విద్యార్థులు ఉపాధ్యాయులపై దాడి చేశారని ఆయన బంధువులు, మృ తుని భార్య ఆరోపిస్తున్నారన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ మరిచినప్పుడు ప్రధానోపాధ్యాయుడు వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ జరపకపోవడం విచారకరమన్నారు. ఈ సంఘటనలో బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో అపుస్మా నాయకులు వీఆర్‌రెడ్డి, రమణారెడ్డి, నాగసుబ్బారెడ్డి, నాగేశ్వర్‌రావు, ఇషాక్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు: అహ్మద్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం చెన్నూరు ఎంఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆపస్ జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు.