ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:05 AM
బి.కొత్తకోట పట్టణంలో ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ అధికారులు మంగళవా రం శ్రీకారం చుట్టారు.
బి.కొత్తకోటలో ఆక్రమణలపై కొరడా..
స్వచ్ఛందంగా తొలగించాలంటూ కమిషనర్ సూచన
బి.కొత్తకోట, నవంబరు(ఆంధ్రజ్యోతి): బి.కొత్తకోట పట్టణంలో ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ అధికారులు మంగళవా రం శ్రీకారం చుట్టారు. నగరపంచాయతీ కమిషనర్ జీఆర్ పల్లవి, పట్టణ సీఐ రాజారెడ్డి పోలీసు సిబ్బందితో పీటీయం రోడ్డు, బెంగళూరురోడ్డు, రంగసముద్రం రోడ్డులతో పాటు, జ్యోతిసర్కిల్‌లో ఆక్రమణలు గా భావించిన కొన్నింటిని తొలగిం చారు. మిగతా వారికి 24 గంటల్లో ఆక్రమణలు తొలగించుకో వాలని సమయమిచ్చారు. గడువులోగా స్వచ్ఛందంగా తొలగిం చక పోతే ప్రొక్లైనర్‌తో తొలగిస్తామని హెచ్చరించారు. పట్ట ణంలోని జ్యోతిచౌక్ నుంచి రం గసముద్రం రోడ్డు, బెంగళూరు రోడ్డు, పీటీయం రోడ్డు లలో దుకాణదారులు తమకు వీలున్న మేరకు మున్సిపల్ డ్రైనేజినిదాటి ఆక్రమణలు జరిగాయి. జ్యోతి సర్కిల్‌లో ఉన్న పురాతన వాటర్‌ట్యాంకు చుట్టుపక్కల, బస్‌షె ల్టర్ ఎదుట, బావిలోగంగమ్మ ఒడ్డున స్థలాన్ని ఆక్రమించి పూల అంగళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ ఆనుకొని బంకులను ఏర్పాటుచేసి అద్దెలకు ఇచ్చు కున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా, ఎన్నిసార్లు ఫిర్యాదు లు వచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే మంగళ వారం కమిషనర్ రంగంలోకి దిగి ఆక్రమణలకు శ్రీకారం చుట్టడంతో ఆక్రమణదారుల్లో లజడి మొదలైంది. ఎంతోకాలం నుంచి ఆక్రమించుకొని అనుభవిస్తున్న వారు ఆందోళనకు గురికాగా, ఈ ఆక్రమణలు ఎప్పుడు తొలగిపోతాయా? బస్టాం డు కు మోక్షం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.