అన్యాక్రాంతమైన దేవదాయ భూములను తిరిగి అప్పగించాలి
ABN , Publish Date - Dec 26 , 2024 | 11:55 PM
అ న్యాక్రాంతమైన దేవదాయ భూములన్నీ తిరిగి అప్పగించాలని చెన్నూరు నాగలింగేశ్వరాలయ కమిటీ సభ్యుడు, గంగసాని శివారెడ్డి, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన శివారెడ్డి ఆర్డీఓ జాన ఇర్వినను కోరారు.
రెవెన్యూ సదస్సులో ఆర్డీఓను కోరిన ఆలయ కమిటీ సభ్యులు, రైతులు
చెన్నూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అ న్యాక్రాంతమైన దేవదాయ భూములన్నీ తిరిగి అప్పగించాలని చెన్నూరు నాగలింగేశ్వరాలయ కమిటీ సభ్యుడు, గంగసాని శివారెడ్డి, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన శివారెడ్డి ఆర్డీఓ జాన ఇర్వినను కోరారు. చెన్నూరులో గురువా రం జరిగిన రెవెన్యూ సదస్సుకు కడప ఆర్డీఓ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమైనా సమస్యలుంటే తెల పా లన్నారు. అందుకు వారు స్పందిస్తూ మం డల వ్యాప్తంగా 11 రెవెన్యూ గ్రామ పంచాయతీల్లో 166.71 ఎకరాలు భూమి ఉందని, అం దులో కొంత మాత్రమే దేవదాయ పరిధిలో ఉంద న్నారు. మిగిలినదంతా ఆక్రమణలో ఉం ద న్నారు. ఆక్రమణలను వెలికితీయాలని కోరా రు. మండలంలో ఎంతో పురాతనమైన ఆలయాలు ఉన్నాయని, దాతలు ఆలయాల అభివృద్ధి, ధూపదీప నైవేద్యాల కోసం భూములు రాసి ఇస్తే కొందరు ఆ భూములను ఆ క్రమించుకున్నారన్నారు. ఆ భూములను దేవదాయ శాఖ ద్వారా బయటికి తీయించి ఆ లయాలకు అప్పగిస్తే ధూపదీప నైవేద్యాలతో పాటు అర్చకులకు జీతాలు, ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించేందుకు వీలుంటుంద న్నా రు. వారి సమస్యలు విన్న ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సుకు దేవదాయ శాఖ సిబ్బందిని పిలిపించి వారి ద్వారా ఆయాప్రాంత పరిధిలో ఉన్న పాత ఆలయాలకు సంబంధించిన భూములను బయటికి తీయిస్తామ న్నారు. అనంతరం రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలు అర్జీల రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు సరస్వతి, సర్వేయరు సోమశేఖర్, డీటీ వెంకటరమణ, ఆర్‌ఐ కౌషిక్, వీఆర్వోలు రసూల్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.