Share News

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:59 PM

వారందరు 38ఏళ్ల క్రితం ఆ పాఠశాలలో చదువుకున్నవారు అందరు వివాహాలు చే సుకొని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డవారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
వేంపల్లెలోని తల్లిశెట్టి శేషమ్మ బాలికల ఉన్నత పాఠశాశాలలో కలిసిన పూర్వ విద్యార్థినులు

ఉపాధ్యాయులకు సత్కారం

వేంపల్లె,సెప్టెంబరు 15: వారందరు 38ఏళ్ల క్రితం ఆ పాఠశాలలో చదువుకున్నవారు అందరు వివాహాలు చే సుకొని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డవారు. పాత జ్ఞాపకాలను ఒక్కసా రి గుర్తుచేసుకొని పూర్వ విద్యార్థినిలు ఒక్కచోటకు చేరుకున్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను మనసారా గుర్తుకుతెచ్చుకొని ఆనందపడ్డారు. వేంపల్లెలోని తల్లిశెట్టి శేషమ్మ బాలికల ఉన్నత పాఠశాశాలలో 1985-86 విద్యాసంవత్సరంలో 10వ తరగతి పూర్తైన విద్యార్థినిలు ఆదివారం ఆత్మీయ స మావేశం నిర్వహించారు. అపుడు చదువుచెప్పిన ఉపాధ్యాయులు మం గమ్మ, సరస్వతమ్మ, శంకుంతలమ్మ, సరోజమ్మలను శాలువ, పూలమాలలతో సత్కరించి నూతన వస్త్రాలుఅందించారు. పూర్వ విద్యార్థినులు షకీల, రాజేశ్వరి, నాగవల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న అందరు కలుసుకొని కబుర్లు చెప్పుకొన్నారు. ఒకరిగురించి ఒకరు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సరళ, పద్మ, భాను, ధనలక్ష్మి, గీతావాణి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:59 PM