భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్: ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:29 AM
భారత రాజ్యాంగ నిర్మాత, దళిత, బడుగు, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత అంబేడ్కర్ అని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవీరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూలో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి అన్నారు.
కడప(వినాయకనగర్), డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత, దళిత, బడుగు, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత అంబేడ్కర్ అని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవీరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూలో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి అన్నారు. గురువారం అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణంలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కడప నగర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మద్దూది రాయుడు, శివానందపురం ఇనచార్జి తదితరులు పాల్గొన్నారు.
దళితమిత్ర సంఘం ఆధ్వర్యంలో...
అంబేడ్కర్ విగ్రహానికి దళితమిత్ర సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా ని వాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు కైపు రామాంజనేయులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మనోహర్, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ రూపకర్తకు ఘన నివాళి
్డకడప సెవెనరోడ్స్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) :రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ వర్ధంతినిశుక్రవారం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండు సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎనడీ విజయజ్యోతి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కడప అసెంబ్లీ కో ఆర్డినేటరు బండి జకరయ్య, సిటీ అధ్యక్షుడు అప్జల్‌ఖాన, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలీఖాన, ఏఐసీసీ కో ఆర్డినేటరు అబ్దుల్ సత్తార్, యూత కాంగ్రె్‌స రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్‌కుమార్, ఎనఎ్‌సయుఐ జిల్లా అధ్యక్షులు మామిళ్లబాబు, మల్లెం విజయభాస్కర్, సయ్యద్‌సలావుద్దీన పాల్గొన్నారు.