అమితషాను తక్షణం బర్తరఫ్ చేయాలి
ABN , Publish Date - Dec 21 , 2024 | 11:31 PM
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌అం బేడ్కర్‌పై అనుచిత వ్యా ఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత షా ను తక్షణమే మంత్రి వ ర్గం నుంచి బర్తరఫ్ చేయా లని ఎనఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృతతేజ డిమాండ్ చేశారు.
పీలేరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌అం బేడ్కర్‌పై అనుచిత వ్యా ఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత షా ను తక్షణమే మంత్రి వ ర్గం నుంచి బర్తరఫ్ చేయా లని ఎనఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృతతేజ డిమాండ్ చేశారు. అమిత షా వ్యాఖ్యలను వ్యతిరే కిస్తూ శనివారం ఎనఎస్ యూఐ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యల్ని సభా నాయ కుడిగా ఖండించాల్సిన ప్రధాన మంత్రి, అమిత షాను సమర్థించడం శోచనీయమన్నారు. అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలను అమిత షా వెనక్కు తీసుకునే వరకు నిరసనలు జరుగు తూనే ఉంటాయన్నారు. అనంతరం వారు అమిత షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎనఎస్‌యూఐ నాయకులు సాయి సంపత కుమా ర్, కాంగ్రెస్ నాయ కులు యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.