అంగనవాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:47 PM
పీలేరు పట్టణంలోని లక్ష్మీపురం కాలనీ వాసులు తమ ప్రాంతంలో అంగనవాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని అధికా రులను డిమాండ్ చేశారు.
పీలేరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): పీలేరు పట్టణంలోని లక్ష్మీపురం కాలనీ వాసులు తమ ప్రాంతంలో అంగనవాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని అధికా రులను డిమాండ్ చేశారు. లక్ష్మీపురంలో శుక్రవారం సివిల్ రైట్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘ నాయకులు, లక్ష్మీపురం వాసులు మాట్లాడుతూ తమ ప్రాంతంలో అంగనవాడీ కేంద్రం లేకపోవడంతో పిల్లలు బయటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. అదే విధంగా తమ కాలనీలోని సుమారు 100 కుటుంబాలకు ప్రభుత్వం అందజేస్తున్న 200 యూని ట్ల ఉచిత విద్యుత పథకం అందడం లేదన్నారు. కాలనీ సమీపంలోనే శ్మశాన వాటిక కేటాయిం చాలని, రేషన సరుకుల పంపిణీ కోసం రేషన డీలర్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. కాలనీలో మురుగునీటి వ్యవస్థ సరిగ్గా లేనందువల్ల తరచూ అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోయారు. ఈ సందర్భంగా తహసీల్దారు భీమేశ్వర రావు మాట్లాడుతూ లక్ష్మీపురం ప్రాంత సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో లోకేశ్వర రెడ్డి, ఈవోపీఆర్‌ఆర్‌డీ లతీఫ్ ఖాన, ఎస్‌ఐ లోకేశ, డీటీ సుబ్రహ్మణ్యం, దళిత సంఘ నేతలు గండికోట వెంకటేశ, జెట్టి మల్లిఖార్జున, తుమ్మల ధరణీకుమార్, ఎన.సుధాకర్ బాబు, దుర్గాప్రసాద్, అంజమ్మ, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.