Share News

అంగన్వాడీ కేంద్రంలో దోమల నివారణ చర్యలు

ABN , Publish Date - Nov 12 , 2024 | 11:58 PM

మురుగు నీటి కుంటతో అంగన్వాడీ చిన్నారులకు ఇబ్బందులపై మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘చిత్రం చెప్పిన సమస్య’కు అధికారులు వెంటనే స్పందించారు

అంగన్వాడీ కేంద్రంలో దోమల నివారణ చర్యలు
చెన్నూరు అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్న మురుగు నీటికుంటలో దోమల నివారణకు మందు వేస్తున్న అధికారులు

చెన్నూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మురుగు నీటి కుంటతో అంగన్వాడీ చిన్నారులకు ఇబ్బందులపై మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘చిత్రం చెప్పిన సమస్య’కు అధికారులు వెంటనే స్పందించారు. ఈ మేరకు చెన్నూరు కొత్తగాంధీనగర్‌ అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్న మురుగు నీటి కుంటలో మంగళవారం దోమల నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇకపై ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపడతామన్నారు. నీటి కుంటలో ఆయిల్‌బాల్స్‌, దోమల నివారణ మందులను వేశారు. అంతేకాక నీరు నిల్వ లేకుండా త్వరలో కాల్వను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ఏఎనఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 11:58 PM