పింఛన్లు, రేషనకార్డులకు దరఖాస్తు చేసుకోండి
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:47 PM
కొత్తపింఛన్లకు, రేషన కార్డులకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్ధనరెడ్డి తెలిపారు.
కడప ఎడ్యుకేషన, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : కొత్తపింఛన్లకు, రేషన కార్డులకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్ధనరెడ్డి తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత పాలకులు పింఛ న్లు, రేషనకార్డుల విషయంలో లబ్ధిదారులకు అన్యాయం చేశారన్నారు. సీఎం చంద్రబాబు అర్హులైన వారందరికీ పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సచివాలయంలో ఈ నెల 2 నుంచి 28లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, వికలాంగులు, డప్పు, చర్మకళాకారులు, కల్లుగీత కార్మికులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆధార్ జిరాక్స్‌తో పాటు కుల ధ్రువీకరణ పత్రం, ఆరు నెలల విద్యుత బిల్లులు, బియ్యం కార్డు జిరాక్స్ జత చేయాలని ఆయన వివరించారు.