Share News

బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌లు తొలగించాలి

ABN , Publish Date - Sep 23 , 2024 | 12:24 AM

బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌లను తొలగించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర పూర్వపు ప్రధాన కార్యదర్శి కులశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌లు తొలగించాలి
మాట్లాడుతున్న కులశేఖర్‌ రెడ్డి

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కులశేఖర్‌ రెడ్డి

కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 22 : బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌లను తొలగించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర పూర్వపు ప్రధాన కార్యదర్శి కులశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఎన్జీఓ హోంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాద్యాయ సమస్యలపై ఏపీటీఎఫ్‌ నిరంతర పోరాటం చేస్తోందన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు స్వేచ్ఛగా బోధన చేసే పరిస్థితులు లేవన్నారు. ఆటంకంగా ఉన్న అనవసర యాప్‌లను తొలగించాలని మీడియం, సిలబస్‌ తరగతుల విలీనంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, రాష్ట్ర అకడమిక్‌ సభ్యుడు సాంబశివరెడ్డి, కడప డీసీఈబీ సెక్రటరీ భాస్కర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 117ను రద్దు చేసి ప్రాథమిక విద్యను కాపాడాలన్నారు. జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు ప్రతా్‌పరెడ్డి, ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 12:24 AM