Share News

ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ABN , Publish Date - Sep 29 , 2024 | 11:26 PM

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని ఏపీ ఆశ వర్కర్స్‌ యూనియన అన్నమయ్య జిల్లా ఇనచార్జి గుంటి వేణుగోపాల్‌, యూనియన రాష్ట్ర అధ్యక్షురాలు పీ.సుభాషిణి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చేశారు.

ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా బాధ్యుడు గుంటి వేణుగోపాల్‌

రాయచోటిటౌన, సెప్టెంబరు 29: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని ఏపీ ఆశ వర్కర్స్‌ యూనియన అన్నమయ్య జిల్లా ఇనచార్జి గుంటి వేణుగోపాల్‌, యూనియన రాష్ట్ర అధ్యక్షురాలు పీ.సుభాషిణి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీవో హోంలో ఆశ వర్కర్స్‌ యూనియన జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి అధ్యక్షతన జిల్లా జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేకుండా గర్భిణులు, బాలింతలకు, నవజాత శిశువులకు సేవలందిస్తూ 17 ఏళ్లుగా సెలవులు కూడా లేకుండా పనిచేస్తున్న ఆశ కార్యకర్తలను మెడికల్‌ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఆశ కార్యకర్తలపై అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. సాధారణ సెలవులు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు మంజూరు చేయాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జీవోలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలవెన్స బకాయిలను తక్షణం విడుదల చేయాలని, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని, రూ.10 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని, కరోనా అలవెన్స తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, ఏఎనఎం కోర్సు పూర్తి చేసిన కార్యకర్తలు పనిచేసిన సంవత్సరాలను ట్రైనింగ్‌గా పరిగణనలోనికి తీసుకొని ఏఎనఎంలుగా ప్రమోషన ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సంబంధం లేని పనులను చేయించరాదని ఏజెన్సీ టార్గెట్లను ఉపసంహరించుకోవాలన్నారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆశా గ్రీవెన్స సమావేశంలో అందిన వినతులను తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఏపీ ఆశ వర్కర్స్‌ యూనియన జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమ్మ, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్దిగాళ్ల శ్రీనివాసులు, ఆశ వర్కర్స్‌ యూనియన జిల్లా గౌరవాధ్యక్షుడు గంగాధర్‌, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ అసోసియేషన జిల్లా కోకన్వీనర్‌ సరోజమ్మ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి సుమిత్ర, ఆశా యూనియన జిల్లా నాయకులు కనకమ్మ, నారాయణమ్మ, రజియా, పెద్ద ఎత్తున ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 11:26 PM