Share News

ఎమ్మెల్యే నల్లారి చొరవతో స్వదేశానికి తిరిగి వచ్చిన పీలేరు వాసి

ABN , Publish Date - Sep 27 , 2024 | 11:44 PM

పీలేరు మండలం కాకు లారంపల్లె ఇంది రమ్మ కాలనీకి చెందిన మున స్వామి ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమా ర్‌రెడ్డి చొరవతో శుక్ర వారం స్వదేశానికి తిరిగి వచ్చారు.

ఎమ్మెల్యే నల్లారి చొరవతో   స్వదేశానికి తిరిగి వచ్చిన పీలేరు వాసి
ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డితో మునస్వామి

పీలేరు, సెప్టెంబరు 27: పీలేరు మండలం కాకు లారంపల్లె ఇంది రమ్మ కాలనీకి చెందిన మున స్వామి ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమా ర్‌రెడ్డి చొరవతో శుక్ర వారం స్వదేశానికి తిరిగి వచ్చారు. వివరాల్లోకి వెళితే.. మునస్వామి తన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కోటి ఆశలతో మలేషియా వెళ్లాడు. నాలుగు డబ్బులకు ఆశపడి దేశం కాని దేశానికి వెళ్లిన అతనికి అక్కడ నిరాశే ఎదురైంది. చెప్పిన పని ఒకటి, అక్కడ చేయించబోయింది మరొకటి కావడంతో అక్కడ సమస్యలు చుట్టుముట్టాయి. పనిలో పెట్టు కున్న వాళ్లు తినడానికి తిండి కూడా పెట్టకుండా కష్టాలు పెట్టారు. దిక్కుతోచని స్థితిలో తన నిస్సహాయతను కుటుంబసభ్యులకు తెలిపాడు. వారు తమకు సాయం చేయాలని పీలేరు ఎమ్మెల్యేను అర్థించారు. ఆయన రంగంలోకి దిగి జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. ఆయన మన దేశ ఎంబసీ ద్వారా మలేషియాలో బందీగా ఉన్న మునస్వామిని విడిపించి స్వదేశానికి వచ్చే ఏర్పాటు చేశారు. దీంతో అతనికి, అతని కుటుంబానికి ఊరట లభించింది. వ్యవసాయ కూలీ అయిన మున స్వామి మెరుగైన జీవితం కోసం రాయచోటిలోని ఓ ఏజెంటు ద్వారా రూ.3 లక్షలు ఖర్చు చేసుకుని మలేషియా వెళ్లాడు. నెలకు రూ.50 వేల జీతమని, మలేషియాలో నర్సరీ పని చేయాల్సి ఉంటుందని ఏజెంటు చెప్పిన మాటలు నమ్మి ఈ నెల 10న అక్కడకు వెళ్లగా కారు షెడ్డులో పనికి పంపారు. రెండు రోజుల తరువాత అక్కడ పని లేదన్నారు. తనకు చెప్పిన పని మరొకటి అని, ఆ పని ఇప్పించకపోతే తనను ఇం టికి పంపేయాలని మునస్వామి వారిని కోరాడు. దీంతో అతనిని ఓ ఇంటిలో నిర్బంధించి కనీసం భోజనం కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. మూడు రోజులు ఎలాగోలా నెట్టుకొచ్చిన మునస్వామి తను పడుతున్న కష్టాన్ని ఇందిరమ్మ కాలనీలోని కుటుంబసభ్యులకు తెలియ జేయడం వారు ఎమ్మెల్యేను అర్థించడంతో తిరిగి స్వదేశానికి అతను రాగలిగాడు. దీంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలి యజేశారు. తనను మళ్లీ కుటుంబసభ్యుల చెంతకు చేర్చిన ఎమ్మెల్యే సాయాన్ని మరిచిపోలేనని కన్నీటి పర్యంతమయ్యాడు. సకాలంలో స్పం దించిన ఎమ్మెల్యేను అందరూ అభినందించారు.

Updated Date - Sep 27 , 2024 | 11:44 PM