Share News

మున్సిపల్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లీజుకు వేలం

ABN , Publish Date - Sep 12 , 2024 | 11:52 PM

మున్సిపల్‌ అనిబిసెంట్‌ హైస్కూలులోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను 45 రోజుల పాటు లీజుకు ఇచ్చేందుకు గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో వేలం పాటలు జరిగాయి. ఈ వేలం పాటలను కమిషనర్‌ రఘునాధరెడి,్డ ఆర్‌వో శ్రీనివాసుల ఆధ్వరంలో నిర్వహించారు. మూడు సంవత్సరాల సరాసరి ఆదాయాన్ని లెక్కకట్టి 1.20 కోట్లు సర్కారువారి పాట తో వేలం పాటను ప్రారంభించారు.

మున్సిపల్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లీజుకు వేలం

మున్సిపాలిటీకి 1.75 కోట్లు ఆదాయం

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 12 : మున్సిపల్‌ అనిబిసెంట్‌ హైస్కూలులోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను 45 రోజుల పాటు లీజుకు ఇచ్చేందుకు గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో వేలం పాటలు జరిగాయి. ఈ వేలం పాటలను కమిషనర్‌ రఘునాధరెడి,్డ ఆర్‌వో శ్రీనివాసుల ఆధ్వరంలో నిర్వహించారు. మూడు సంవత్సరాల సరాసరి ఆదాయాన్ని లెక్కకట్టి 1.20 కోట్లు సర్కారువారి పాట తో వేలం పాటను ప్రారంభించారు. దాదాపు 18 మంది ఎగ్జిబిషన్‌ లీజు వేలంలో పాల్గొన్నారు. అందులో ఆర్‌వీ చలపతి 1.75 కోట్లకు అత్యధికంగా వేలం పాట పాడి లీజు దక్కించుకున్నారు. మున్సిపల్‌ గెజిట్‌ ప్రకారం ఎగ్జిబిషన్‌ ఎంట్రీ ఫీజు పెద్దలకు 25 రూపాయలు, పిల్లలకు 15 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. అలాగే సైకిల్‌కు 5రూపాయలు ,స్కూటరుకు 10 రూపాయలు, కార్లకు 20 రూపాయలు మాత్రమే వసూలు చేయాల్సి వుంటుంది. కాగా 2021లో డీవీ భాస్కర్‌ కోటి రూపాయలకు పాట పాడి నేటికి 7.10 లక్షలు బకాయి చెల్లించలేదు. 2022 లోపాతకోట బలరామిరెడ్డి 1.42 కోట్లకు పాటపాడి జీఎస్టీతో కలిపి 30.06 లక్షలు బకాయి వున్నారు. 2023లో 1.17కోట్లుకు వెంకటరామిరెడ్డి పాటపాడి రూ.5.66 లక్షలు బకాయి వున్నారు.వీరికి అనేక మార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని వీరిపై కోర్టులో కేసు వేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

Updated Date - Sep 12 , 2024 | 11:52 PM