Home » Proddatur
సుమారు 12 ఏళ్ల ప్రాయంలోనే యాగంటి నుంచి ప్రాద్దుటూరు రామేశ్వరానికి వచ్చిన దొంగకోళ్ల మునిస్వామిగా వ్యవహరించే మునెయ్య స్వామి తిరుణాళ్ల సోమవారం వేడుకగా నిర్వహించనున్నా రు.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు లేని జీవితం ముందుకు సాగలేదు. ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేవి కళ్లు. మన ఆలోచనలు, ఆరోగ్యానికి ప్రతిబింబాలు కళ్లు... రంగుల ప్రపంచాన్ని చూస్తూ... కోటి కాంతులను పంచుతూ... కలలను పండించుకోవాల్సిన కళ్లకు కమ్ముకున్న కాలుష్యం, పోషకాహార లేమితో నిర్జీవంగా మారుతున్నాయి.
మండల పరిధిలోని శెట్టివారిపల్లె గ్రామ ప్రజలు భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కొండప్రాంతం కావడం.. అడవి జంతువుల సంచారం కూడా ఉండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.
గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు వసతుల కల్పనలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. సచివాలయాలు తప్ప నిత్యం ప్రజలకు అవసరమయ్యే ప్రభుత్వ కార్యాలయలను పునర్మించికపోవడంతో నిర్వాసితులు ఇబ్బంది పడుతున్నారు.
విజయవాడలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశ అనంతరం సీఎం చంద్రబాబును ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రత్యేకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు.ప్రొద్దుటూరులో అభివృ ద్ధి కార్యక్రమాల నిధుల కేటాయింపుతో పాటు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఆయన సీఎంకు వినతి పత్రం అందజేశారు.
ప్రొద్దుటూరుమున్సిపాలిటీ స్థలాలు ఒక్కొక్కటిగా అన్యాక్రాంతం అవుతున్నాయి. మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు కొన్నేళ్లుగా కళ్లు మూసుకున్నట్టుగా వ్యవహరించడంతో అక్రమ కట్టడాలతో పాటు మున్సిపల్ స్థలాల ఆక్రమణలు పెరిగిపోయాయి. ప్రొద్దుటూరు మున్సిపల్
బాల్యంలో తన తండ్రి పెద్ద వరదారెడ్డి నేర్పిన క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్నే 82 ఏళ్ల వయస్సులోనూ ఇంకా కొనసాగిస్తున్నారు. అందరూ పల్లెలు వొదిలి పట్టణాల్లో బంగ్లాలు కట్టుకుని జీవిస్తుంటేఆయన నేటికీ తన స్వగ్రామం కామనూరులోని రాధా నగర్‌లోనే నివాసం ఉంటున్నారు.
మున్సిపల్ అనిబిసెంట్ హైస్కూలులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను 45 రోజుల పాటు లీజుకు ఇచ్చేందుకు గురువారం మున్సిపల్ కార్యాలయంలో వేలం పాటలు జరిగాయి. ఈ వేలం పాటలను కమిషనర్ రఘునాధరెడి,్డ ఆర్‌వో శ్రీనివాసుల ఆధ్వరంలో నిర్వహించారు. మూడు సంవత్సరాల సరాసరి ఆదాయాన్ని లెక్కకట్టి 1.20 కోట్లు సర్కారువారి పాట తో వేలం పాటను ప్రారంభించారు.
విజయవాడ వరదబాధితుల కోసం ప్రొద్దుటూరు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఆ సంస్థ అధ్యక్షుడు బొర్రా రామాంజనేయులు తెలిపారు. గురువారం సాయం త్రం బీసీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం లోమాట్లా డుతూ నాలుగు రోజులుగా పట్టణంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, వైద్యులు దాతలనుంచి దాదాపు మూడు లక్షల మేరకు విరాళాలు సేకరించామన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పని సర్దుబాటు చేపట్టింది. విద్యాశాఖాధికారుల నిర్వాకంతో సర్దుబాటు పక్రియ గందరగోళంగా తయారైంది. దీంతో విద్యాశాఖాధికారులపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.