Share News

భువనేశ్వరీ ఆలయంలో బతుకమ్మ పండుగ

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:00 AM

మండలంలోని కురవంకలోని భువనేశ్వరీ ఆలయంలో దశమ మహావిద్య హోమాల్లో భాగంగా బుధవారం తెలం గాణా మంత్రి రాజనరసింహ భార్య పద్మనీదేవి పాల్గొని బతుకమ్మ పండ గను వైభవంగా నిర్వహించారు.

భువనేశ్వరీ ఆలయంలో బతుకమ్మ పండుగ
భువనేశ్వరీ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న తెలంగాణ మంత్రి రాజనరసింహ భార్య పద్మనీరెడ్డి

పాల్గొన్న తెలంగాణ మంత్రి రాజనరసింహ భార్య పద్మనీరెడ్డి

మదనపల్లె అర్బన, అక్టోబరు 9: మండలంలోని కురవంకలోని భువనేశ్వరీ ఆలయంలో దశమ మహావిద్య హోమాల్లో భాగంగా బుధవారం తెలం గాణా మంత్రి రాజనరసింహ భార్య పద్మనీదేవి పాల్గొని బతుకమ్మ పండ గను వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ నిర్వహకులు స్వామి వెంకటేశ పద్మనీదేవికి ఘనంగా స్వాగతం పలికారు. ఆమె భువనేశ్వరీ దేవి ఆలయంలోని వివిధ రూపాల్లో ఉన్న ఏకశిలా విగ్రహాలను సందర్శిం చారు. మహిళలతో కలిసి బతుకమ్మకు పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 12:00 AM