పీలేరులో ఆధిపత్య పోరు
ABN , Publish Date - Nov 01 , 2024 | 11:21 PM
మారిన ప్రభు త్వం, రాజకీయ సమీకరణాలతో పీలేరు గ్రామ పంచాయతీలో రాజకీయ ఆధిపత్యపోరు నెలకొం ది.
గ్రామ పంచాయతీ ఈఓ టార్గెట్‌గా ఓ వర్గం ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు బెదిరింపుల యత్నమంటున్న వైనం
పీలేరు, నవంబరు1(ఆంధ్రజ్యోతి): మారిన ప్రభు త్వం, రాజకీయ సమీకరణాలతో పీలేరు గ్రామ పంచాయతీలో రాజకీయ ఆధిపత్యపోరు నెలకొం ది. ప్రతిపక్షానికి కొరకరాని కొయ్యగా మారిన ఈఓను దెబ్బతీసేందుకు తమ మార్కు రాజకీ యాలతో వైసీపీ నేతలు సోషియల్ మీడియా వేదికగా ఆయనపై దాడిని తీవ్రతరం చేస్తున్నారు. కొంత కాలంగా అంతర్గత కలహాలతో ఉన్న వైసీపీ నేత లు, ప్రస్తుతం ఈఓపై మూకుమ్మడి దాడి ప్రారంభించారు. పంచాయతీ పాలన గాడి తప్పిం దని సాక్షాత్తు సర్పంచు, వార్డు సభ్యులు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతుండడం విశేషం. తమ పోస్టులను స్థానిక గ్రూపుల్లో తమ అనుచరుల ద్వారా వైరల్ చేయించడం, తమకు అనుకూలం గా ఉన్న పంచాయతీ సిబ్బందిని ఆయనపై తిరుగు బాటు చేసేలా ప్రేరేపించడం, రెచ్చగొట్టే పనులకు పాల్పడుతుండడంతో పంచాయతీ కార్యాలయం నిత్యం చర్చనీయాంశమైంది.
వైసీపీ నేతలకు ఇక్కట్లు
2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకున్న అనంతరం పీలేరు పంచాయతీ పాల నా వ్యవహారాల్లో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధి కారం చేపట్టడంతో వైసీపీకి ఇబ్బందులు ఎదుర య్యాయి. పీలేరు పంచాయతీ వ్యవ హారాలపై ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై ప్రత్యేక విచారణ జరిపించారు. ఇందులో నిధులు దుర్వినియోగమై నట్లు నిర్ధారణ కావడంతో పీలేరు ఈఓలుగా పని చేసిన వారిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించా రు. ఇందులో భాగంగా పీలేరు ఈఓగా పనిచేసిన వాల్మీకిపురం పంచాయతీ సీనియర్ అసిస్టెంట్ రెడ్డివరప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. గతంలో ఈఓలుగా పనిచేసిన ఈఓపీఆర్ ఆర్‌డీలు వర ప్రసాద్, ఎస్‌ఏగఫూర్‌పై శాఖాపర చర్యలకు రాష్ట్ర ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. వీట న్నింటి నేపథ్యంలో కలికిరి ఈఓ గురు మోహన ను పీలేరు ఇన్‌చార్జి ఈఓగా జిల్లా ఉన్న తాధికా రులు నియమించారు. అనంతరం జరిగిన సాధా రణ బదిలీల్లో ఆయకు పూర్తి బాధ్యతలు అప్పగిం చారు. దీంతో తొలి అడుగుగా పంచాయతీ కార్మి కులుగా నమోదు చేసుకుని పంచాయతీ నిధుల తో జీతాలు తీసుకుంటున్న వైసీపీ నేతలు, వారి కుటుంబస భ్యులైన 22 మందిని తొలగించారు. అప్పటి నుంచి వైసీపీ నేతలు ఆయనపై ధ్వేషం పెంచుకుని వ్యక్తిగత దాడికి పూనుకున్నా రు.
వైరల్‌గా మారిన ఈఓపై ఆరోపణలు
గతంలో కడప జిల్లాలో పనిచేసినప్పుడు ఆయన, ఆయన సహచర, సీనియర్ ఉద్యోగులు పెద్దఎ త్తున అవినీతికి పాల్పడినట్లు తమ వద్ద ఆధారా లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బహిర్గతం చేస్తామని కొందరు వైసీపీ నేతలు స్థానిక గ్రూపు ల్లో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులపై స్థానిక టీడీపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కలికిరి ఈఓగా వైసీపీ నాయకులే గతంలో ఆయ నను తెచ్చుకున్నారని, వైసీపీ హయాంలో సచ్ఛీలు డైన అధికారి, టీడీపీ హయాంలో అవినీ తిపరుడిగా ఎలా మారిపోయాడంటూ ప్రశ్నిస్తు న్నారు. ఈఓను బెదిరించి లొంగదీసుకునేందుకు వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అక్రమార్జనను అడ్డుకున్నందుకే ఆరోపణలు
పీలేరు ఈఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుం చి గతంలో విచ్ఛలవిడిగా సాగిన విద్యుత మో టార్ల రిపేర్లు, కొత్త వాటి కొనుగోళ్లను నియంత్రిం చ గలిగాను. ఈ అంశాలు నచ్చని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా విధులు నిర్వహించడం ఉద్యోగుల విధి. పంచాయతీ వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నాను. పోస్టుల వ్యవహారంపై త్వరలో నే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. పోలీసు లకు ఫిర్యాదు కూడా చేస్తాను. పోస్టుల వెనుక ఎవరు న్నా వదిలిపెట్టేది లేదు.
-గురుమోహన, ఈఓ, పీలేరు పంచాయతీ