Share News

క్షయవ్యాధి లేని సమాజం కోసమే బీసీజీ టీకా

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:28 PM

క్షయ వ్యాధి లేని సమాజం కోసమే వయోజన బీసీజీ టీకాను వే స్తున్నట్లు ఆరోగ్యవైద్యాధికారి మహమ్మద్‌రఫి, టీబీ పర్యవే క్షకుడు నాగిరెడ్డి పేర్కొన్నారు.

క్షయవ్యాధి లేని సమాజం కోసమే బీసీజీ టీకా
రెడ్డివారిపల్లెలో బీసీజీ టీకా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వెద్య సిబ్బంది

నిమ్మనపల్లి, జూన 7: క్షయ వ్యాధి లేని సమాజం కోసమే వయోజన బీసీజీ టీకాను వే స్తున్నట్లు ఆరోగ్యవైద్యాధికారి మహమ్మద్‌రఫి, టీబీ పర్యవే క్షకుడు నాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రెడ్డివారిపల్లి. ఎగువమాచిరె డ్డిగారిపల్లిల్లో ప్రజలకు బీసీజీ టీకా గురించి వివరించారు. భవిష్యత్తులో క్షయవ్యాధి రాకుం డా ముందస్తు జాగ్రత్త ఉండేందుకు ప్రభుత్వం బీసీజీ టీకాను తెచ్చిదన్నారు. అలాగే 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకాను వేసుకొంటే భవిష్య త్తులో క్షయ వ్యాధి భారిన పడకుండా ఉంటారని తెలిపారు. ముఖ్యంగా 60ఏళ్లు నిండితే ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. ప్రస్తుతం మండంలోని అన్ని గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ బీసీజీ టీకాలను వేస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎనఎమ్‌లు, ఆశాలు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:28 PM