Share News

విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలి

ABN , Publish Date - Oct 24 , 2024 | 11:47 PM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు మరింత మెరుగైన భోజనం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వాల్మీ కిపురం జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి, మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన గురు అరవింద్‌ ఆదేశించారు.

విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలి
వాల్మీకిపురంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేస్తున్న జడ్జి గురుఅరవింద్‌

వాల్మీకిపురం, అక్టోబరు 24(ఆంధ్ర జ్యో తి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు మరింత మెరుగైన భోజనం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వాల్మీ కిపురం జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి, మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన గురు అరవింద్‌ ఆదేశించారు. గురు వా రం మధ్యాహ్నం స్థానిక పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జడ్పీ బాలి కోన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈసంద ర్భంగా విద్యార్థులకు ఇస్తున్న భోజనం, మౌలిక వసతుల కల్పన స్థితిగతుల వివరాలను ఆరా తీశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భోజనంలో మరింత మార్పులు తెచ్చి నాణ్యమైన భోజనం అందించాలని సూచిం చారు. కార్యక్రమా ల్లో ఏజీపీ అశోక్‌కుమార్‌రెడ్డి, బార్‌ అసోసియేషన అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌, హెచఎంలు సావిత్రి, శ్రీదేవి, ఎస్‌ఐ2, శ్రీహరి, ఉపాధ్యాయులు, మండల న్యాయసేవాధికారి సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 11:47 PM