ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
ABN , Publish Date - Oct 16 , 2024 | 12:08 AM
ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కా రానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తంబళ్లపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇనచార్జ్ పోతుల సాయినాథ్ పిలుపు నిచ్చారు.
పెద్దమండ్యం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కా రానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తంబళ్లపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇనచార్జ్ పోతుల సాయినాథ్ పిలుపు నిచ్చారు. మండలంలోని తురకపల్లిలో మంగళవారం జనసేనపార్టీ ఆధ్వర్యంలో కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కూటమి నేతలు పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికి అందించడానికి కూటమి నేతలు సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వాధికారులు, నేతలు కలసి పథకాల వివరాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. అనంతరం బండమీదపల్లి గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. కూటమి నేతలు ఇస్మాయిల్, నాగూరి మస్తానవలి, చలపతి, ప్రభాకరరెడ్డి, ధనాంజనేయులు, ప్రకాష్‌రెడ్డి, వసీం తదితరులు పాల్గొన్నారు.