‘సీడీపీఓను సస్పెండ్ చేయాలి’
ABN , Publish Date - Oct 26 , 2024 | 11:58 PM
అంగన్వాడీ వర్కర్లను వేధింపులకు గురి చేస్తున్న కడప సీడీపీఓను తక్షణం సస్పెండ్ చేయాలని కడప కలెక్టరేట్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కడప సెవెనరోడ్స్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : అంగన్వాడీ వర్కర్లను వేధింపులకు గురి చేస్తున్న కడప సీడీపీఓను తక్షణం సస్పెండ్ చేయాలని కడప కలెక్టరేట్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హె ల్పర్స్ యూనియన జిల్గా గౌరవాధ్యక్షుడు మనోహర్ మాట్లాడుతూ కడప సెంటరులో పర్యవేక్షణ పేరుతో అంనగ్వాడీ వర్కర్లను సీడీపీఓ బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం దారుణమన్నారు. ధర్నాలో సీఐటీయూ నగర అధ్యక్షుడు చంద్రారెడ్డి, అంగన్వాడీ యూ నియన కడప అర్బన సెక్రటరీ వినీల, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు.