Share News

గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామి

ABN , Publish Date - May 23 , 2024 | 11:22 PM

ప్రముఖ పుణ్యక్షేత్రం వెల్లాల చెన్నకేశవ, సంజీవరాయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గరుడోత్సవం వైభవంగా జరిగింది.

గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామి

రాజుపాలెం, మే 23: ప్రముఖ పుణ్యక్షేత్రం వెల్లాల చెన్నకేశవ, సంజీవరాయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గరుడోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత చెన్న కేశవస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణతో పురవీధుల్లో స్వామివారి వాహన సేవ సాగింది. గరుడోత్సవం చూ సేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ జగదీశ్వర్‌ రెడ్డి, కార్యనిర్వహణాధికారి బీవీ నరసయ్య, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:22 PM