Share News

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం : ఎమ్మెల్యే

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:32 AM

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి అన్నారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం : ఎమ్మెల్యే
లఘు చిత్రానికి క్లాప్‌ ఇస్తున్న ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి

వీరపునాయునిపల్లె, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి అన్నారు. గురువారం స్థానిక సంగమేశ్వర ఉన్నత పా ఠశాల ఆవరణంలో గురువారం ‘బాల్య వివాహాలు రద్దు’ లఘు చిత్రానికి క్లాప్‌ ఇచ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికడదాం అని ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్‌ బైరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గండి ఓబయ్యయాదవ్‌, సగమేశ్వర విద్యాసంస్థల కార్యదర్శ వివి సుబ్బానాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుభాషిణి, మాజీ సర్పం చు వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 12:32 AM