ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:44 PM
క్రిస్మస్ పండుగ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధల తో జరుపుకున్నారు.
మదనపల్లె అర్బన, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ పండుగ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధల తో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంగళవా రం అర్ధరాత్రి నుంచే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మదనపల్లె పట్టణం, మండలంలోని క్రైస్తవులు బుధవారం చర్చిలలో, పార్థన మంది రాల్లో క్రిస్మస్ ప్రార్థనలు చేశారు. మదనపల్లె పట్ట ణంలోని పురాతనమైన జాకబ్‌చాంబర్లిన చర్చిలో రాయలసీమ డయాసిస్ బిషప్ రెవరెండ్ వరప్ర సాద్ యేస్తుక్రీస్తు దైవ దూతగా మానవ రూపం లో ఈలోకానికి వచ్చారన్నారు. ప్రజల్లో శాంతి, దయ, నిస్వార్థం, పేమ నింపడానికే ప్రభువు వచ్చారన్నారు. సీఎస్‌ఐ చర్చి ఆవరణం భక్తులతో కిటకిటలాడింది. క్రిస్మస్ సందర్భంగా చర్చిల్లో పండుగ శోభ సంతరించుకుంది. మహిళలు క్రీస్తు ఆరాధన పాటలు ఆలాపించారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా సీఎస్‌ఐ చర్చిలో స్థానిక చిత్తూరు బస్టాండ్ సమీపంలోని ఇమ్మానియల్ మినిసీ్ట్రస్ చర్చిల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. సీఎస్‌ఐ హైస్కూల్ ఆవరణలోని షెకీలాఫెయిత వినిస్ర్టేస్ చర్చిలో పాస్టర్ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిం చారు. కార్యక్రమంలో షేరీనా పెయిత ఫౌండేషన నిర్వహకుడు డేవడ్‌రాజు, దినేష్‌పాల్, వికాష్‌పాల్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ చర్చిలో, సెయింట్ లూక్స్ చర్చిలో, పోత బోలు చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక పార్థనలు చేశారు.
పీలేరులో: పీలేరు మండలంలోని క్రైస్తవులు బుధవారం క్రిస్మస్ పండుగను అత్యంత భక్తిశ్ర ద్ధలతో జరుపుకున్నారు. కరుణామయుడు యేసు క్రీస్తు బోధించిన మార్గమే ఆచరణీయమని ఆయా ప్రార్థనా మందిరాల్లో మతబోధకులు పేర్కొన్నారు. పీలేరులోని చిత్తూరు రోడ్డు, తిరుపతి రోడ్డు, ట్రాన్సకో కార్యాలయం తదితర ప్రార్థనా మందిరా లతోపాటు వివిధ గ్రామాల్లో ఉన్న చర్చులు, ప్రార్థ నా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించ డమే కాకుండా పేదలకు అన్నదానం చేశారు. ప్రార్థనల కోసం వచ్చిన వారికి అసౌ కర్యం కలుగ కుండా ఆయా ప్రార్థనా మందిరాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నిమ్మనపల్లిలో: మండలంలోని పలు గ్రామాలలో క్రిస్మస్ వేడుకలను పాస్టర్లు ఘనంగా నిర్వహిం చారు. బుధవారం లోకరక్షకుడు మేసు ప్రభు పట్టినరోజు సందర్బంగా పలు చర్చిలలో ప్రార్థన లు చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు పాల్గొన్నారు.
పెద్దమండ్యంలో: ప్రతి ఒక్కరు భక్తి భావంతో ఉండాలని పెద్దమండ్యం బేతస్థ చర్చీ ఫాస్టర్ శ్యాముల్ పేర్కొన్నారు. బుధవారం మండలం లోని పెద్దమండ్యం, వెలిగల్లు, తురకపల్లి గ్రా మా లలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తు లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గుర్రంకొండలో:గుర్రంకొండ మండలంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గుర్రంకొండ పీటర్ రాక్ చర్చిలో ఫాదర్ జానబాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరా లు జరుపుకున్నారు.
కలకడలో:కలకడ మండలంలోని పలు చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకు న్నారు. ఈ సందర్భంగా దుస్తులు పంపిణీ చేసి పేదలకు అన్నదానాలు చేశారు. తరువాత పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ములకలచెరువులో: మండలంలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ములకల చెరువు, మద్దినాయనిపల్లె, సెంట్రల్ స్కూల్, పర్తికోట, పెద్దపాళ్యం తదితర గ్రామాల్లోకి చర్చిలు, ప్రార్ధనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి అన్నదానాలు చేశారు. అలాగే పాత ములకలచెరువు, ములకలచెరువు ప్రార్ధనా మందిరాల్లో టీడీపీ నేతలు గుత్తికొండ త్యాగరాజు, యర్రగుడి సురేష్, కేవీ రమణ, ఫాస్టర్ శ్రీనివా సులు, గంగాదేవి తదితరులు కేక్‌లు కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.
తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె మండలంలో యేసు క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి. బుధవా రం ఉదయం నుంచి రాత్రి వరకూ చర్చిలలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. మండల పరిధిలో ఉన్న చర్చిలు, ప్రార్థనా మందిరాలను విద్యుత దీపాలతో అలంకరించారు. . అనంతరం కేకు కట్ చేసి ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుని సంబరాలు జరుపుకున్నారు.
వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండల వ్యాప్తం గా బుధవారం క్రిస్మస్ పండుగ వేడుకలను క్రైస్త వులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పట్టణం లోని సీఎస్‌ఐ చర్చిని ప్రత్యేకంగా అలంకరించి ప్రార్థనలు నిర్వహించి, కేకు కట్ చేసి పంచిపె ట్టారు. ఈసందర్భంగా చర్చి ఫాస్టర్ మేరీ క్రిస్మస్ పండుగ విశిష్టతను తెలియజేశారు. అనంతరం చర్చి ఎదుట నిరుపేదలకు దాన ధరాలు చేపట్టా రు. అలాగే మండలం వ్యాప్తంగా ప్రార్థనా మంది రాలలో పండుగ వేడుకలు జరుపుకుని శుభాకాం క్షలు తెలుపుకున్నారు. ఈకార్యక్రమాలలో స్థానిక చర్చి కమిటీ సెక్రటరీ జోసెఫ్, సభ్యులు ప్రభు చరణ్, రవి, ఆనంద్, క్రైస్తవులు పాల్గొన్నారు.
కురబలకోటలో:మండలంలోని అంగళ్లు సియో ను ప్రార్థనా మందిరం, తెట్టు, కామూరివాండ్లపల్లె, ఆరోగ్యపురం తదితర చర్చిలలో క్రిస్మస్ పండుగ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ప్రపంచ శాంతి కోసం ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా చర్చిలను విద్యుత దీపా లతో ప్రత్యేకంగా అలంకరించి ముస్తాబు చేశారు.
బి.కొత్తకోటలో: క్రైస్తవులకు అత్యంత ప్రాముఖ్య మైన క్రిస్మస్ పర్వదినాన్ని బి.కొత్తకోట మండలం లో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పట్ట ణంలోని రంగసముద్రం రోడ్డు, నందిశెట్టివీధిల లోని చర్చిలతో పాటు, శంకరాపురం, కుమ్మరి వాం డ్లపలె,్ల గోళ్లపల్లె చర్చిలలో ఆయా పాస్టర్లు క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. చర్చిలను సుందరంగా అలంకరిచారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిరాల ప్రాంగణంలో అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. నగరపంచాయతీ కమిషనర్ పల్లవి, తహశీల్దార్ మహమ్మద్‌అన్సారీ లు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిపారు.