Share News

ఈగల్‌ డిస్టిలరీలో సీఐడీ సోదాలు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:37 PM

కడప నగర పరిధిలో ఉన్న ఈగల్‌ డిస్టిలరీ ఫ్యాక్టరీలో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిస్టిలరీ ఫ్యాక్టరీలలో సీఐడీతో పాటు ఎక్సైజ్‌ అధికారులు కలిసి ఈ సోదాలు కొనసాగిస్తున్నారు.

ఈగల్‌ డిస్టిలరీలో సీఐడీ సోదాలు
సీఐడీ అధికారులు తనిఖీ చేస్తున్న ఈగల్‌ డిస్టిలరీ ఇదే

ఉదయం నుంచి సాగుతున్న తనిఖీలు

కడప క్రైం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కడప నగర పరిధిలో ఉన్న ఈగల్‌ డిస్టిలరీ ఫ్యాక్టరీలో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిస్టిలరీ ఫ్యాక్టరీలలో సీఐడీతో పాటు ఎక్సైజ్‌ అధికారులు కలిసి ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. డిస్టిలరీలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. అలాగే మద్యం తయారు చేసే పదార్థాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గతంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు కూడా ఈ డిస్టిలరీలో తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కూడా సీఐడీ అధికారులు ఇక్కడ తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను పరిశీలించడంతో పాటు స్వాఽధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం తయారీకి ఉపయోగించే పదార్థాల శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు సమాచారం. అయితే డిస్టిలరీ ఫ్యాక్టరీలోకి ఎవరినీ అనుమతించలేదు.

Updated Date - Oct 22 , 2024 | 11:38 PM