Share News

మార్కెట్‌ చైర్మనకు పోటాపోటీ

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:01 PM

మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన పదవిని దక్కించుకుకోవడానికి చాలా మంది ఆశావ హులు పోటీలో వున్నట్లు సమాచారం.

మార్కెట్‌ చైర్మనకు పోటాపోటీ
మదనపల్లె మార్కెట్‌ కమిటీ కార్యాలయం

నామినేటెడ్‌ పదవుల పందేరంలో ఆశావహులు ఆచితూచి అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే

మదనపల్లె టౌన, అక్టోబరు 22: మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన పదవిని దక్కించుకుకోవడానికి చాలా మంది ఆశావ హులు పోటీలో వున్నట్లు సమాచారం. మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లె మండలాల పరిధిలో వ్యవసాయ ఉత్పత్తులు విక్రయిం చేందుకు ఏడు దశాబ్దాల క్రితం మదనపల్లె మార్కెట్‌ కమిటీ ఏర్పా టు చేశారు. అప్పట్లో కురబలకోట, బి.కొత్తకోట మండలాలు కూడా ఈ కమిటీ కిందే ఉండేవి. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో బి.కొత్తకోట, అంగళ్లు మార్కెట్‌ కమిటీలను మదనపల్లె నుంచి విభజించగా, ఇప్పుడు మూడు మండలాలే మిగిలాయి.

అధిక ఆదాయం..ఎమ్మెల్యే స్థాయి పదవి

మదనపల్లె మార్కెట్‌ కమిటీ పరిధిలోని మార్కెట్‌ యార్డులో దేశం లోనే అత్యధికంగా టమోటా విక్రయాలు జరుగుతాయి. సీజనతో పనిలేకుండా ఏడాది పొడవునా ఇక్కడ టమోటా విక్రయాలు జరు గుతాయి. ఏడాదికి మార్కెట్‌ సెస్సు రూపంలోనే రూ.2 నుంచి రూ.3 కోట్ల లక్ష్యంగా ఉంటుంది. వాటికి అధనంగా మండీల లైసెన్సులు, షాపింగ్‌ గదుల ఆదాయం పెరుగుతోంది. ఈ క్రమంలో మదనపల్లె మార్కెట్‌ కమిటీ నియామకంపై ఎమ్మెల్యే షాజహానబాషా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా మూడు మండలాల్లో మార్కెట్‌ కమిటీ చైర్మన వైస్‌చైర్మన, డైరెక్టర్ల పదవులను ఎవరికి కేటాయిస్తే సముచితంగా ఉంటుందో ఎమ్మెల్యే విచారిస్తునట్లు తెలిసింది.

నామినేటెడ్‌ పదవుల పందేరంలో ఆశావహులు

మదనపల్లె ఎమ్మెల్యే పదవి ముస్లీం మైనారిటీలకు వరించడంతో, అదే స్థాయి పదవి అయిన మార్కెట్‌ కమిటీ చైర్మన పదవి ఈ సారి బీసీ, కాపు(రెడ్డి), బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికే దక్వే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో తొలి నుంచి టీడీపీలో ఉంటూ, ఎమ్మెల్యే షాజహానబాషా టీడీపీ చేరినప్పటి నుం చి ఆయన వెన్నంటే నడిచిన పలువురు మార్కెట్‌ చైర్మన పదవి కోసం ఆశపడుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా జనసేన, బీజేపీ నాయకులు కూడా తమ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మార్కెట్‌ చైర్మ న పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ పదవి ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.

Updated Date - Oct 22 , 2024 | 11:01 PM