సర్వేయర్ పనితీరుపై విచారణ చేయించండి
ABN , Publish Date - Sep 09 , 2024 | 11:35 PM
మదనపల్లె మండల సర్వేయర్ పని తీరుపై విచారణ చేయించాలని మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుండా మనోహర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్‌కు మాలమహానాడు నేతల ఫిర్యాదు
మదనపల్లె టౌన, సెప్టెంబరు 9: మదనపల్లె మండల సర్వేయర్ పని తీరుపై విచారణ చేయించాలని మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుండా మనోహర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం రాయ చోటిలో నిర్వహించిన ప్రజా సమస్య ల పరిష్కార వేదిక కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు కలెక్టర్ అర్జీ అందజేశారు. డివిజన కేంద్రమైన మదనపల్లె మండలంలో 20 గ్రామ సచివాలయాల్లో సర్వే కోసం చలాను కట్టడానికి వెళితే, అక్కడి సిబ్బంది మండల సర్వేయనను కలవాలని చెబుతున్నారని మండల సర్వే యర్ రెకమెండేషన చేస్తేనే గ్రామ సర్వేయర్లు సర్వేకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములను వెంటనే సర్వే చేయించే సర్వేయర్ పేదలు, రైతుల భూముల సర్వేకి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. చలానాలు కట్టి తిరస్కరించబడిన రైతులను విచారిస్తే అసలు విషయం తెలుస్తుందని ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ చామకూరి శ్రీధర్ మదనపల్లె తహసీల్దార్ ఖాజాభీకి వీడియో కాన్ఫెరెన్సలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాలమహానాడు నాయకులు మల్లెల మోహన, రమణ, పాల్గొన్నారు.
ఫ మదనపల్లె మండలం వలసపల్లె హౌసింగ్ కాలనీలో అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటా యించారని గ్రామస్థులు మదుకర్‌రెడ్డి, శివరామ్, నారాయణ, జాఫర్, వెంకటేశు, సాలమ్మ, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వలసపల్లె హౌసింగ్ కాలనీలోని 311, 312 ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకు కేటాయించారని దీనిపై గ్రామ వీఆర్‌వో, హౌసింగ్ ఈఈకి ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. వాటితో పాటు 10 ఇళ్ల స్థలాలను అనర్హులకు కేటా యించారని, విజిలెన్స అధికారులతో విచారించాలని ఆఫిర్యాదులో కలెక్టర్‌ను కోరారు.