ఉర్దూ స్కూల్ కాంప్లెక్స్‌లను కొనసాగించండి
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:22 PM
రాష్ట్రంలోని ఉర్దూ మీడియం సబ్జెక్టులు, లాంగ్వేజ్, ఎస్‌జీటీ ఉపాధ్యాయుల స్కూ ల్ కాంప్లెక్స్‌లను యదావిధిగా పాత స్కూల్ కాంప్లెక్స్ పాఠశాలలలోనే కొనసాగించాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ను రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ హిదాయతుల్లా, అల్ మైనారిటీస్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన రాష్ట్ర చైర్మన డాక్టర్ ఫరూక్ కోరారు.
కడప ఎడ్యుకేషన, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉర్దూ మీడియం సబ్జెక్టులు, లాంగ్వేజ్, ఎస్‌జీటీ ఉపాధ్యాయుల స్కూ ల్ కాంప్లెక్స్‌లను యదావిధిగా పాత స్కూల్ కాంప్లెక్స్ పాఠశాలలలోనే కొనసాగించాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ను రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ హిదాయతుల్లా, అల్ మైనారిటీస్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన రాష్ట్ర చైర్మన డాక్టర్ ఫరూక్ కోరారు. సోమవారం నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రూటా రాష్ట్ర శాఖ, నంద్యాల జిల్లా శాఖ తరపున వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖాధికారులు హ డావుడి నిర్ణయాలతో మైనర్ మీడియా ఉర్దూ ఉపాధ్యాయులు, విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఉర్దూ మీ డియం పాఠశాలలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉర్దూ డీఐ హష్ముద్దీన, రాష్ట్ర నాయకులు ముహమ్మద్ అయ్యుబ్, అబ్దుల్ హకీమ్, అఫ్జల్ బాషా, దస్తగీర్, జానీబాషా, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం, ఆర్థిక సహాయ కార్యదర్శి ముహమ్మద్ హనీఫ్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.