ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:08 AM
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని నియోజకవర్గ ఇనచార్జ్ మారేడు రవీంద్రనాధ్‌రెడ్డి (బీటెక్ రవి) అన్నారు.
- సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన బీటెక్ ర వి
పులివెందుల టౌన, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని నియోజకవర్గ ఇనచార్జ్ మారేడు రవీంద్రనాధ్‌రెడ్డి (బీటెక్ రవి) అన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయనిధి చేయూతనందిస్తుందన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలంయలో నియోజకవర్గంలో అనారోగ్యంతో ఇబ్బంది పడిన వారికి దాదాపు 25 మందికి రూ.13లక్షల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం సహాయ నిధి అందించేలా కృషి చేస్తానన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వారి సమస్యలను ఓపిగ్గా విని వాటి పరిష్కారానికి కృషి చేశారు. సమస్య చెప్పిన వెంటనే సంబంధిత అధికారులకు ఫోన చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. న్యాయ బద్దమైన సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. అందరికీ అందుబాటులో ఉంటానని నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నందిపల్లె రామగంగిరెడ్డి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.